Sat Dec 21 2024 16:22:09 GMT+0000 (Coordinated Universal Time)
దుబాయ్ చేరుకున్న భారత జట్టు
ఆగస్టు 27న ప్రారంభం కానున్న ఆసియా కప్ 2022కి ముందు రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్ ఇండియా
ఆసియా కప్-2022 కోసం భారతజట్టు బుధవారం దుబాయి చేరింది. ఈ సిరీస్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ 28వ తేదీన నిర్వహించనున్నారు. పలు టూర్లకు దూరంగా ఉన్న భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆసియా కప్ కోసం జట్టు సభ్యులతో కలిసి దుబాయి చేరాడు. ఇతర జట్ల ఆటగాళ్లతో విరాట్ కోహ్లీ కలిశాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌తో షేక్ హ్యాండ్ ఇస్తూ కనిపించాడు.
ఆగస్టు 27న ప్రారంభం కానున్న ఆసియా కప్ 2022కి ముందు రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్ ఇండియా మంగళవారం (ఆగస్టు 23) దుబాయ్‌లో అడుగుపెట్టింది. BCCI అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసిన వీడియోలో, భారత క్రికెట్ జట్టు సభ్యులు దుబాయ్ చేరుకోవడంతో పాటూ ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొనడాన్ని కూడా చూడవచ్చు. వీడియోలో.. కొంతమంది భారత ఆటగాళ్ళు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లను కూడా కలుసుకోవడం చూడవచ్చు. హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్ ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు మహ్మద్ నబీతో మాట్లాడుతూ ఉండగా, విరాట్ కోహ్లీ రషీద్ ఖాన్‌తో చర్చిస్తూ కనిపించాడు.భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంతో కరచాలనం చేస్తూ కనిపించాడు. ఆ తర్వాత భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు.
ఈ సిరీస్ లో కోహ్లి తిరిగి ఫామ్ అందుకుంటాడని అందరూ భావిస్తూ ఉన్నారు. దాదాపు మూడు సంవత్సరాలుగా కోహ్లికి అంతర్జాతీయ సెంచరీ లేకుండా పోయింది. నవంబర్ 2019లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టులో అతని చివరి శతకం. 2022లో కోహ్లీ నాలుగు T20Iలలో 81 పరుగులను సాధించాడు, అత్యధిక స్కోరు 52. ఆసియా కప్‌లో నిలకడగా కోహ్లీ ఆడటం భారత్ కు చాలా అవసరం. ఆస్ట్రేలియాలో జరిగే T20 ప్రపంచ కప్‌కు బిల్డ్-అప్ టోర్నమెంట్‌గా ఆసియా కప్ ను భావిస్తూ ఉన్నారు. ఇక్కడ జట్టు ప్రదర్శనను బట్టి భారత్ టీ20 వరల్డ్ కప్ ప్రణాళికలు ఉంటాయి.
Next Story