స్పిన్నర్లపై భారీ షాట్స్ తో విరుచుకుపడిన విరాట్ కోహ్లీ
2022 ఆసియా కప్‌కు కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉంది.
2022 ఆసియా కప్‌కు కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా భారత్ టోర్నమెంట్ లో అడుగుపెట్టబోతోంది. ఆగస్టు 28న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. వరుసగా మూడవసారి ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. ఇక భారత జట్టులో విరాట్ కోహ్లీ ఫామ్ లేకపోవడం అటు అభిమానులను.. ఇటు జట్టు యాజమాన్యాన్ని కలవరపెడుతున్న అంశం. అందుకు తగ్గట్టుగా విరాట్ కోహ్లీ రాణించడానికి నెట్స్ లో చెమటోడుస్తూ ఉన్నాడు. మొదటి మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్ కూడా ప్రారంభించారు. ఇంగ్లండ్‌తో జరిగిన వైట్-బాల్ సిరీస్‌లో విరాట్ కోహ్లీ ఆడగా.. ఆ తర్వాత వెస్టిండీస్-జింబాబ్వేతో జరిగిన తదుపరి సిరీస్‌లకు విశ్రాంతి తీసుకున్నాడు. 33 ఏళ్ల విరాట్ కోహ్లీ IPL 2022 లో 16 ఇన్నింగ్స్‌లలో కేవలం రెండు అర్ధ సెంచరీలు మాత్రమే నమోదు చేశాడు. ఇంగ్లాండ్ పర్యటనలో 20 పరుగుల అత్యధిక స్కోరు మాత్రమే సాధించాడు.