Thu Dec 19 2024 17:07:44 GMT+0000 (Coordinated Universal Time)
Ayodhya : అయోధ్యలో ఎన్ని విశేషాలో.. అక్కడికి వెళ్లలేని వారి కోసం మాత్రమే
అయోధ్యలో అనేక విశేషాలున్నాయి. ఆధ్మాత్మిక సంతరించుకున్న ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం పుణ్యంగా భావిస్తారు
అయోధ్యకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. సప్త ముక్తి క్షేత్రాలలో ప్రధానమైనది. దేశంలో ఏడు పుణ్యక్షేత్రాలలో దేనినో ఒక్కదానిని దర్శించుకుంటే ముక్తిని పొందినట్లే భావిస్తారు. హిందువులు. అందులో అయోధ్య ప్రధానమైనది. మొదటిది. పురాణాల్లో తెలిపిన వివరాల ప్రకారం భారత్ లో ఏడు క్షేత్రాలు సప్తముక్తి క్షేత్రాలుగా పేరుపొందాయి. అందులో అయోధ్య ప్రధానమైనది. మొదటిది. అయోధ్య, మధుర, హరిద్వార్, వారణాసి, కాంచీపురం, ఉజ్జయిని, ద్వారక క్షేత్రాలను దర్శించుకుంటే చాలు ధన్యులయినట్లే. అందుకే అయోధ్యతో పాటు ఈ ఆలయాలకు కూడా అంతటి ప్రాముఖ్యత భారదేశంలో ఉంది.
ఆధ్యాత్మిక వాతావరణం...
ఈ ఏడు పుణ్యక్షేత్రాల్లో మరణించే లోగా ఏదో ఒకదానిని దర్శించుకుంటే చాలు మరుజన్మ ఉండదని నమ్ముతారు. అది హిందువుల విశ్వాసం. నమ్మకం కూడా. పురాణాలు కూడా అదే చెప్పడంతో ఈ దైవ క్షేత్రాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తూ ఉంటుంది. నిత్యం ఈ క్షేత్రాలకు భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. సీజన్ తో సంబంధం లేకుండా నిత్యం భక్తులతో ఆలయాలు ఇవి. వీటిని దర్శించుకునేందుకు భారతదేశం నలుమూలల నుంచి అనేక మంది వస్తుంటారు. అందుకే ఈ క్షేత్రాలకు ప్రత్యేక ప్రాధాన్యత అనాదిగా సంతరించుకుంది. ఇప్పుడే కాదు.. ఎప్పటి నుంచో అయోధ్య రామాలయాన్ని ఒక్కసారైనా దర్శించుకుందామనుకునే వారికి రేపటి నుంచి ఆలయ ద్వారాలు తెరుచుకునే ఉంటాయి.
రోజుకు రెండు లక్షల మందికి...
ఒకే సారి 1700 మంది భక్తులు ఆలయంలోకి ప్రవేశించేలా నిర్మాణం చేపట్టారు. రోజుకు రెండు లక్షల మంది భక్తులు దర్శించుకునేలా వసతులతో పాటు సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. అయోధ్యకు అంతటి ప్రాధాన్యత ఉంది. అయోధ్యలో నేడు విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతుండటంతో దేశమంతా పండగ వాతావరణం జరుపుకుంటుంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు ప్రభుత్వాలు సెలవులు ప్రకటించాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం హాఫ్ డే హాలిడే ప్రకటించింది. ప్రఖ్యాత టైమ్ స్వ్కేర్ లోనూ అయోధ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ట లైవ్ టెలికాస్ట్ ఏర్పాటు జరిగింది. అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ అయోధ్యలో అనేక విశేషాలున్నాయి.
విశేషాలివే....
రామాలయంలో 2,100 అడుగల గంట
108 అడుగుల అగరుబత్తీ
400 కిలోల బరువున్న తాళం
30 కిలోల బరువున్న తాళంచెవి
ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం 84 సెకన్లు
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్తో పనిచేయనున్న కెమెరాలు
అయోధ్యలో 10 వేల సీసీీ కెమెరాల ఏర్పాటు
వందకు పైగా ఛార్టెడ్ విమానాల రాకపోకలు
దేశం నలుమూలల నుంచి వెయ్యి రైళ్లు
ఏడాదికి ఒక రోజు రాముడికి సూర్యుడి తిలకం
ప్రాణప్రతిష్టలో పాల్గొననున్న పథ్నాలుగు జంటలు
Next Story