Sun Dec 22 2024 17:38:01 GMT+0000 (Coordinated Universal Time)
Ayodhya : రాముడి నడయాడిన నేలపై నేడు... దేశమంతా రామమయమే
తొలి దర్శనం చేసుకోవాలని భావించిన భక్తులు దేశం నలుమూలల నుంచి బయలుదేరి ఈ శుభఘడియల కోసం ఎదురు చూస్తున్నారు
అయోధ్యకు ఈరోజు వెళ్లి తీరాల్సిందే అనుకుని అందరూ అదే బాట పట్టారు. దీంతో అయోధ్య వీధులన్నీ భక్తులతో కిటకిట లాడుతున్నాయి. బాలరాముడిని తొలి దర్శనం చేసుకోవాలని భావించిన భక్తులు దేశం నలుమూలల నుంచి బయలుదేరి కొన్ని రోజుల క్రితమే ఈ శుభఘడియల కోసం ఎదురు చూస్తున్నారు. అయోధ్య అంతా ఆధ్మాత్మిక వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా రామనామమే. రామ భజనలే. ఓ రామ నీనామమెంత రుచిరా అంటూ వీధుల్లో తిరుగుతూ తమకు దర్శనం ఎప్పుడు కలుగుతుందా? అని రెప్పలు వాల్చకుండా ఎదురు చూస్తున్నారు. అలాంటి శుభఘడియలు మరికొద్ది గంటల్లోనే సాక్షాత్కారం కానున్నాయి.
ఐదు వందల ఏళ్ల నాటి...
శ్రీరాముడి జన్మించిన భూమిలో ఒక్కసారి కాలుమోపితే చాలు అని యావత్ దేశం మొత్తం పరితపిస్తుంది. అందులోనూ ఐదువందల ఏళ్ల నాటి కోరిక. నేడు నెరవేరబోతున్న సమయంలో అందరిలోనూ రామయ్య పట్ల భక్తితో పాటు.. అది నీవీల్లనే సాకారమయ్యిందన్న భావన. అందుకో ఆ రామయ్య కోసం అయోధ్యలో బారులు తీరారు. సరిగ్గా 12.05 గంటలకు బాల రాముడి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. ఈ శుభఘడియల కోసం దేశమంతా ఆసక్తికగా ఎదురు చూస్తుంది. రామయ్యను కనులారా వీక్షించేందుకు బారులు తీరారు. వారిని ఆపడం ఎవరి తరమూ కావడంలేదు. దేశం మొత్తం రామభక్తితో ఊగిపోతుంది.
తొలి దర్శనానికి...
అయితే తొలి దర్శనానికి దేశ వ్యాప్తంగా ఎనిమిదివేల మంది ప్రముఖులకు మాత్రమే ఆహ్వానాలు అందాయి. వీరిలో రాజకీయ నేతలు, సినీ సెలబ్రిటీలు, అధికారులు కూడా ఉన్నారు. అందరికీ ఆహ్వానాలు స్వయంగా ట్రస్ట్ కు చెందిన వారితో పాటు ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ వంటి సంస్థలకు చెందిన ప్రముఖులు స్వయంగా వెళ్లి అందచేశారు. వీరంతా దాదాపు అయోధ్యకు నిన్ననే చేరుకున్నారు. తొలి దర్శన భాగ్యం వీరికే దక్కనుంది. చారిత్రాత్మక ఘట్టాన్ని స్వయంగా వీక్షించేందుకు వచ్చిన వారికి అన్ని సౌకర్యాలను సమకూర్చారు. వారికి వసతితో పాటు ప్రత్యేక భద్రతను కల్పించారు. ఈ నాలుగు గంటలు కీలకసమయమని భావించి అందరూ భక్తి భావంతో కనులు ఆర్పకుండా ఆధ్మాత్మిక దృష్టితో చూస్తున్నారు. అయోధ్యకు ఇప్పడు వెళ్లే అవకాశం లేని వారికి ఈ నెల 22వ తేదీ నుంచి అనుమతిస్తారు. అందుకోసం ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను కూడా రైల్వే శాఖ నడుతపుతుంది.
Next Story