Sun Dec 22 2024 17:41:01 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : అయోధ్యలో చంద్రబాబు, పవన్ కల్యాణ్
అయోధ్యకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేరుకున్నారు
అయోధ్యకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేరుకున్నారు. నిన్న అయోధ్యకు చేరుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు నేడు జరిగే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇప్పటికే అనేక మంది రాజకీయ నేతలు అయోధ్యకు చేరుకుని ఈరోజు కోసం ఎదురు చూస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న అనేక మంది రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు అయోధ్య చేరుకోవడంతో వీవీఐపీల రూములన్నీ దాదాపుగా నిండిపోయాయి. చంద్రబాబు వెంట శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు.
భారీ భద్రత మధ్య...
మధ్యాహ్నం 12.05 గంటలకు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో అనేక మంది పాల్గొంటారు. వీవీఐపీలు ఎక్కువ మంది రావడంతో అయోధ్యలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడ చూసినా నిఘా కనపడుతుంది. డ్రోన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తీవ్రవాదుల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో పదమూడు వేల మందికి పైగా పోలీసులు ఉన్నారు. అందరినీ క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే ఆలయంలోకి అనుమతిస్తారు.
Next Story