Mon Dec 23 2024 01:00:56 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 : హోస్ట్ నాగార్జునకు ఏపీ హైకోర్టు నోటీసులు
బిగ్ బాస్ లో ఎంటర్టైన్ మెంట్ కంటే.. అశ్లీల కంటెంటే ఎక్కువగా ఉంటోందని, ఈ షో ఫ్యామిలీతో కలిసి చూసేలా లేదని..
స్టార్ మా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతోన్న బిగ్ బాస్ రియాలిటీ షో పై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. వాదోపవాదనలు విన్న అనంతరం.. షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాలీవుడ్ నటుడు నాగార్జునతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
బిగ్ బాస్ లో ఎంటర్టైన్ మెంట్ కంటే.. అశ్లీల కంటెంటే ఎక్కువగా ఉంటోందని, ఈ షో ఫ్యామిలీతో కలిసి చూసేలా లేదని.. షో ని వెంటనే రద్దు చేయాలని ఇటీవలే హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ పిటషన్ పై ఇప్పటికే రెండు దఫాలుగా విచారణ జరగగా.. తాజాగా గురువారం జరిగిన విచారణలో ప్రతివాదులకు నోటీజులు జారీ అయ్యాయి. రెండువారాల్లోగా నోటీసులకు సమాధానమివ్వాలని కోర్టు ఆదేశించింది. కాగా.. గతంలో సీపీఐ నారాయణ కూడా షో పై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
Next Story