Tue Dec 24 2024 12:16:25 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 Day 36 : హౌస్ లో కొత్త జంటలు.. సిల్లీ రీజన్స్ తో నామినేషన్లు, ఈ వారం నామినేట్ అయింది వీరే !
నామినేషన్ల కంటే ముందు హౌస్ లో కొత్త జంటల గురించి మాట్లాడుకున్నారు. నిన్న మొన్నటి వరకూ.. శ్రీసత్యపై అర్జున్ కి..
బిగ్ బాస్ సీజన్ 6 ఐదువారాలు పూర్తి చేసుకుని ఆరోవారంలోకి అడుగుపెట్టింది. ఐదో వారంలో చంటి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. సోమవారం జరిగిన నామినేషన్లలో చాలా వరకు చంటి ఎలిమినేషన్ కు కారణం కీర్తినే అన్న కామెంట్ వినిపించింది. నామినేషన్ల కంటే ముందు హౌస్ లో కొత్త జంటల గురించి మాట్లాడుకున్నారు. నిన్న మొన్నటి వరకూ.. శ్రీసత్యపై అర్జున్ కి ఇంట్రస్ట్ ఉన్నట్లు చూపించి, ఇప్పుడు శ్రీసత్య-శ్రీహాన్ ల మధ్య ఏదో జరుగుతున్నట్లు చూపిస్తున్నారు. గతవారం వారిద్దరూ కలిసి డ్యాన్స్ చేసినప్పటి నుంచి ఫోకస్ వారిపైనే ఉన్నట్లు తెలుస్తోంది.
ఆరోహి ఎలిమినేషన్ ముందు వరకూ.. సూర్య-ఆరోహిలని జంటగా చూపించారు. ఇప్పుడు సూర్య- ఇనయలను జంటగా చూపిస్తున్నారు. అలాగే పెళ్లైన రేవంత్ కి వాసంతిని లింక్ చేసి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు కంటెస్టంట్స్. ఇక నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా ఈ సారి కంటెస్టెంట్స్ వాళ్ళు నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు కంటెస్టెంట్స్ ముఖంపై ఫోమ్ పూసి ఎందుకు నామినేట్ చేస్తున్నారో చెప్పి చేయాలన్నారు బిగ్ బాస్.
కెప్టెన్ గా ఉన్న రేవంత్ తో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. రేవంత్.. బాలాదిత్య, సుదీపలను నామినేట్ చేశాడు. ఆదిరెడ్డి.. మరీనాను, కీర్తిని నామినేట్ చేశాడు. దీంతో మరీనా, ఆదిరెడ్డి మధ్య గొడవ జరిగింది. కీర్తి.. గీతూ, శ్రీసత్యలను, రోహిత్.. శ్రీహాన్, ఆదిని, సుదీప.. ఆది, కీర్తిలను నామినేట్ చేశారు. వాసంతి.. గీతూ, ఆదిలను, శ్రీహాన్.. గీతూ, రాజ్‌లను, బాలాదిత్య కూడా గీతూ, రాజ్‌లను నామినేట్ చేశారు. అర్జున్.. కీర్తిని, ఆదిని నామినేట్ చేశాడు.
సూర్య.. గీతూ, ఆదిని, ఫైమా.. సుదీప, బాలాదిత్యను, ఇనయా.. శ్రీహాన్, కీర్తిలని నామినేట్ చేశారు. ఇక రాజ్.. గీతూ, బాలాదిత్యను, మరీనా.. కీర్తి, ఆదిరెడ్డిని, గీతూ.. రాజ్, కీర్తిలని నామినేట్ చేశారు. గీతూ నామినేషన్లో రాజ్ తో గొడవపెట్టుకుంది. శ్రీసత్య.. కీర్తి, ఆదిరెడ్డిలని నామినేట్ చేసింది. ఆదిరెడ్డిని నామినేట్ చేసినవారంతా అతను ఎంటర్టైన్ మెంట్ ఇవ్వడం లేదని, కెప్టెన్ గా విఫలమయ్యాడన్న పాయింట్లే చెప్పారు. మొత్తంగా ఈవారం ఇంటి నుంచి బయటికి వెళ్లేందుకు 9 మంది నామినేట్ అయ్యారు. కీర్తి, ఆదిరెడ్డి, గీతూ, బాలాదిత్య, సుదీప, శ్రీహాన్, రాజ్, శ్రీసత్య, మరీనాలు నామినేషన్స్ లో ఉన్నారు. మరి వీరిలో ఈ వీకెండ్ కి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.
Next Story