Mon Dec 23 2024 11:30:09 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 Day 80 : కొనసాగుతున్న ఫ్యామిలీ మీట్స్.. సరదాగా సాగుతున్న గేమ్
రోహిత్ వాళ్ల అమ్మ వెనుక నుండి వచ్చి సర్ ప్రైజ్ చేసింది. తల్లిని చూడగానే రోహిత్ కూడా ఎమోషనల్ అయ్యాడు. ఇటీవలే హౌజ్ నుంచి..
బిగ్ బాస్ సీజన్ 6లో రెండు రోజులుగా ఫ్యామిలీ మీట్ ఎపిసోడ్స్ ప్రసారమవుతున్నాయి. 24*7 స్ట్రీమింగ్ లో ఇదంతా ఒకరోజే చూపించినా.. ఎపిసోడ్ టెలీకాస్ట్ ఉండేది గంటే కావడంతో ఆలస్యమవుతుంది. గత ఎపిసోడ్ లో ఆదిరెడ్డి భార్య, కూతురు.. రాజ్ వాళ్ల అమ్మ రాగా.. బుధవారం ప్రసారమైన ఎపిసోడ్ లో ఫైమా మదర్, శ్రీసత్య తల్లిదండ్రులు, రోహిత్ మదర్ వచ్చారు. ఫైమా తల్లి షాహీదా హౌస్ లోకి రాగానే.. ఫైమా గట్టిగా హత్తుకుని ముద్దుల వర్షం కురిపించింది. ఇక బయట ఎక్కడైనా కనిపిస్తే.. మీరు ఫైమా మదర్ కదా అని గుర్తుపడుతుంటే సంతోషంగా ఉందని చెప్పారామె.
గేమ్ అందరూ బాగా ఆడుతున్నారని చెప్పారు. ఆ తర్వాత శ్రీ సత్య తండ్రి, తల్లి వచ్చారు. ఇంతలో శ్రీహాన్ తో మా అమ్మకూడా నడుస్తూ వస్తే బాగుంటుంది అంటుండగా.. శ్రీసత్య మదర్ వస్తారు. నడవలేని కారణంగా వీల్ చైర్ లో హౌస్ లోకి తీసుకువస్తారు తండ్రి. వాళ్లిద్దరినీ చూసిన శ్రీసత్య కన్నీళ్లు ఆపుకోలేక ఏడ్చేసింది. తల్లికి గోరుముద్దలు తినిపించింది. శ్రీసత్య తండ్రి నువ్వు బాగానే ఆడుతున్నావు కానీ.. వెటకారం తగ్గించుకో, సిల్లీ కారణాలతో నామినేషన్స్ వేయకు అని చెప్పాడు. వాళ్ళు వెళ్ళిపోయాక తన తల్లికి చికిత్స చేయించడానికి డబ్బులు లేవు అని బాధపడింది.
నెక్ట్స్ రోహిత్ వాళ్ల అమ్మ వెనుక నుండి వచ్చి సర్ ప్రైజ్ చేసింది. తల్లిని చూడగానే రోహిత్ కూడా ఎమోషనల్ అయ్యాడు. ఇటీవలే హౌజ్ నుంచి బయటకి వెళ్లిపోయిన తన భార్యని తలుచుకున్నాడు. మెరీనా తనకోసం పంపిన ఫొటోఫ్రేమ్ చూసి ఏడుస్తూ రిలేషన్లో ఉన్నప్పుడు దిగిన ఫస్ట్ సెల్ఫీ ఇది అని ఎమోషనల్ అయ్యాడు. ఈ ఎపిసోడ్ అంతా కంటెస్టెంట్స్ ఫ్యామిలీల రాకతో ఎమోషనల్ గా, సరదాగా సాగింది. నేటి ఎపిసోడ్ లో శ్రీహాన్ కోసం.. సిరి వస్తోంది. ఇప్పటికే వీరిద్దరికీ సంబంధించిన ప్రోమోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. అలాగే కీర్తి కోసం.. ఆమెతో మనసిచ్చిచూడు సీరియల్ లో నటించిన మహేష్ రానున్నాడు. కానీ.. అందరి తల్లిదండ్రుల్ని చూసి కీర్తి తనకెవరూ లేరని ఏడుస్తోంది. రేవంత్, ఇనయ కోసం ఎవరు వస్తారన్నది ఇంకా రివీల్ కాలేదు.
Next Story