Tue Dec 24 2024 05:38:22 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బాస్ 6 డే 10 : హౌస్ మేట్స్ కి నిద్రలేకుండా చేసిన గీతూ.. కెప్టెన్సీ టాస్క్ లోకి నలుగురు
కెప్టెన్సీ పోటీదారుల కోసం బిగ్ బాస్ మరో టాస్క్ పెడతాడు. ఆ టాస్క్ లో అర్జున్ కల్యాణ్, ఇనయా, ఫైమా, ఆరోహి, కీర్తి భట్ ..
బిగ్ బాస్ సీజన్ 6లో 10వ రోజు ఎపిసోడ్ కొంచెం ఫన్నీగా.. మరికొంచెం ఉత్కంఠగా జరిగింది. అర్థరాత్రి నుంచి తెల్లవారేంతవరకూ గీతూ హౌస్ మేట్స్ కి నిద్రలేకుండా చేసింది. ఎవరి బొమ్మల్ని ఎత్తుకుపోయి ఔట్ చేయాలని తిరుగుతుండటంతో చాలాసేపు ఎవరూ నిద్రపోలేదు. వాసంతి బొమ్మని లాక్కుని పరుగెడుతుండగా.. మిగతా హౌస్ మేట్స్ అడ్డుకున్నారు. ఆ తర్వాత బాలాదిత్య బొమ్మను ఒకసారి చూసిస్తానని తీసుకుని తిరిగివ్వకుండా దాచేసింది. నెక్ట్స్ శ్రీహాన్ ని టార్గెట్ చేసింది.
నిద్రపోతున్న శ్రీహాన్ నుంచి బొమ్మను తీసి.. బాల్కనీలో ఉన్న ఊయలలో పెట్టేసింది. శ్రీహాన్.. అర్జున్ కల్యాణ్ బొమ్మను తీసి.. బాల్కనీలో పెట్టాడు. ఆ తర్వాత గీతూ బొమ్మని తీసేందుకు ట్రై చేశాడు కానీ కుదర్లేదు. ఉదయానికి స్టోర్ రూమ్ లో ఉన్న ఫ్రిడ్జ్ వెనుక రేవంత్ కి గీతూ బొమ్మ కనిపిస్తుంది. కానీ దానికి దుస్తులు ఉండవు. గీతూ తనదగ్గర దాచిపెట్టుకున్న బాలాదిత్య బొమ్మకు.. తన బొమ్మ దుస్తులు వేసి.. ఇది నాదే అంటుంది. కానీ హౌస్ మేట్స్ అందుకు ఒప్పుకోరు. గీతూ ప్లే చేసిన ట్రిక్కే బాలాదిత్య ఆమెదగ్గర ఉపయోగించి తన బొమ్మను తీసుకుంటాడు.
కెప్టెన్సీ పోటీదారుల కోసం బిగ్ బాస్ మరో టాస్క్ పెడతాడు. ఆ టాస్క్ లో అర్జున్ కల్యాణ్, ఇనయా, ఫైమా, ఆరోహి, కీర్తి భట్ పోటీ పడతారు. ఒక రౌండ్ సర్కిల్ లో నిల్చొని.. చేతుల్ని ఉపయోగించకుండా షీల్డ్ తో మిగతా వారిని బయటికి తోసేయాలనేది టాస్క్. ఈ టాస్క్ లో ముందుగా అమ్మాయిలంతా కలిసి అర్జున్ ని బయటకు పంపేస్తారు. తర్వాత నలుగురు అమ్మాయిలు పోటీ పడగా.. ఇనయా విన్నర్ అవుకుంది. ఈ టాస్క్ కి రేవంత్ సంచాలక్ గా వ్యవహరించాడు. ఫైమా చేతుల్ని ఉపయోగించడం, కింద కూర్చోవడంతో ఆమె ఔట్ అని చెప్తాడు. దాంతో ఫైమా ఏడుస్తుంది.
నెక్ట్స్ టాస్క్ లో.. మెరీనా-రోహిత్, షానీ, రాజ్, ఆర్జే సూర్య పాల్గొంటారు. ఈ టాస్క్ లో రెండు రౌండ్లు పెట్టాడు బిగ్ బాస్. మొదటి రౌండ్ లో స్క్రీన్ పై ఐస్ క్రీమ్ పై చూపించిన ఒకటి, రెండు, మూడు స్కూప్ లు అదే ఆర్డర్ లో పెట్టాలి. రెండో రౌండ్ లో రెండు కోన్ లపై మూడు స్కూప్ లు స్క్రీన్ పై చూపిన ఆర్డర్లో ఉంచాలి. ఈ టాస్క్ లో తొలి రౌండ్ లో రాజ్, రెండవ రౌండ్ లో ఆర్జే సూర్య విన్నర్లుగా నిలిచారు. ఇక ఈవారం కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొనేందుకు చంటి, ఇనయా, రాజ్, ఆర్జే సూర్యలు పోటీదారులుగా ఉన్నారు. టాస్కులన్నీ పూర్తవడంతో బిగ్ బాస్.. ఇంటి సభ్యులకు ఇచ్చిన బేబీలకు సెండ్ ఆఫ్ ఇచ్చి స్టోర్ రూమ్ లో పెట్టాలని చెప్పడంతో ఎపిసోడ్ ముగుస్తుంది. నేడు టెలీకాస్ట్ అయ్యే ఎపిసోడ్ లో ఈ నలుగురూ కెప్టెన్సీ టాస్క్ ఆడనున్నారు.
Next Story