Tue Nov 05 2024 16:25:51 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బాస్ 6 డే 11 : ఎమోషన్స్, ఏడుపులతో నిండిన హౌస్.. డీజే డ్యాన్సులతో కొత్త ఉత్సాహం
బంధాలకన్నా డబ్బుకి ఎక్కువ విలువిస్తున్నారని, అది సరైంది కాదని చెప్పింది. అమ్మ, నాన్న ఏం చెప్పినా అది..
బిగ్ బాస్ బాస్ హౌస్ లో 11వరోజు హౌసంతా ఎమోషన్స్ తో నిండిపోయింది. రెండ్రోజుల పాటు బేబీలను ఆడించి, లాలించిన ఇంటిసభ్యులు.. తమకు తమ పర్సనల్ లైఫ్ లో పిల్లలతో ఉన్న అటాచ్ మెంట్ గురించి ఇంటిసభ్యులతో పంచుకోవాలని చెప్పాడు. బిగ్ బాస్ ఆదేశం మేరకు.. అందరూ పిల్లలతో తమకున్న అనుబంధాన్ని షేర్ చేసుకుంటూ.. ఏడ్చి.. ఏడిపించారు. సుదీప 2015లో తన బేబీని కోల్పోయానని, తమ చెల్లి కూతుర్ని తిరిగివ్వడానికి మనసొప్పలేదని చెప్తూ.. ఎమోషనల్ అయింది. రేవంత్.. తనకు పుట్టబోయే బేబీ గురించి మాట్లాడుతూ.. ఎప్పుడెప్పుడు నాన్న అని పిలిపించుకుందామా అని వెయిట్ చేస్తున్నా అని చెప్పుకొచ్చాడు. రోహిత్-మెరీనా.. తన బిడ్డను కడుపులోనే పోగొట్టుకున్నామని చెప్పి బోరుమన్నారు.
చంటి తన తల్లి, కూతుర్లను గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యాడు. ఆదిరెడ్డి తనకూతురికి కళ్లుకనిపించవని అందరూ అన్నప్పుడు బాధపడ్డానని, డాక్టర్లు అలాంటి సమస్యేమీ లేదని చెప్పాక తేరుకున్నానని చెప్పుకొచ్చాడు. హౌస్ మొత్తంలో కీర్తి కథ అందరినీ ఏడిపించేసింది. అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన, పాప అందరూ యాక్సిడెంట్ లో చనిపోగా.. తానొక్కదాన్నే బ్రతికానని చెప్పింది. సొంతింట్లో ఉండలేక.. బెంగళూరుకు వచ్చినపుడు తినడానికి తిండిలేక, పెట్టేవాళ్లు లేక.. కుక్కలకు వేసిన బ్రెడ్ తిన్నరోజులను గుర్తుచేసుకుంది. ఒకపాపను దత్తత తీసుకుని పెంచగా.. ఆ పాపకూడా అనారోగ్యంతో కన్నుమూసిందని తెలిపింది. యాక్సిడెంట్ సమయంలో తన గర్భసంచిని తొలగించడంతో.. జీవితంలో తానిక పిల్లల్ని కనలేనని, మరోపాపను దత్తత తీసుకుని పెంచుతానని చెప్పింది కీర్తి.
శ్రీసత్య.. బంధాలకన్నా డబ్బుకి ఎక్కువ విలువిస్తున్నారని, అది సరైంది కాదని చెప్పింది. అమ్మ, నాన్న ఏం చెప్పినా అది మన మంచికోసమే చెప్తారని, వినకపోతే జీవితాలు నాశమవుతాయని చెప్తూ.. ఏడ్చేసింది. తర్వాత కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. కెప్టెన్సీ కంటెండర్లుగా ఉన్న చంటి, సూర్య, రాజ్, ఇనయా లు డీజేలుగా వ్యవహరించాలి. హౌస్ లో ప్లే అయిన పాటకు మిగతా కంటెస్టంట్స్ అంతా స్టేజీపై డ్యాన్స్ చేయాలి. ఒక్కోపాట ఆగిన తర్వాత బిగ్ బాస్ ఇద్దరు ఇంటిసభ్యులను పిలిచి.. ఇద్దరూ ఏకాభిప్రాయంతో ఒకరికి ఓటేయాలని చెప్తాడు. ఈ ప్రక్రియలో చంటి, రాజ్ లకు రెండేసి ఓట్లు, సూర్యకి ఒక ఓటు వస్తుంది. మిగతా ప్రక్రియను రేపు కొనసాగిద్దామని బిగ్ బాస్ చెప్పడంతో ఎపిసోడ్ ముగుస్తుంది.
Next Story