Mon Dec 23 2024 07:36:39 GMT+0000 (Coordinated Universal Time)
Bigg Boss 6 : హౌస్ మేట్స్ పై నాగ్ ఫైర్.. ఈవారం డబుల్ ఎలిమినేషన్.. నిన్న షానీ.. మరి నేడు ?
బాలాదిత్య, షాని, సుదీప, వాసంతి, శ్రీసత్య, మెరీనా -రోహిత్, అభినయశ్రీ, కీర్తి, శ్రీహన్.. వీరందరిని వెనకాల నించోమని సీరియస్ గా..
బిగ్ బాస్ సీజన్ 6 13వ రోజు టెలీకాస్ట్ అయిన ఎపిసోడ్ లో నాగార్జున ఎప్పటిలాగానే ఎంట్రీ ఇచ్చారు. శుక్రవారం ఇంట్లో ఏం జరిగింది ? ఎవరెవరు ఎవరి గురించి చర్చలు సాగించారో చూపించారు. అనంతరం హౌస్ మేట్స్ తో మాట్లాడారు. తొలివారం ఎలిమినేషన్ లేకుండా సర్ ప్రైజ్ చేసిన నాగ్.. ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అందరికీ షాకిచ్చారు. హౌస్ మేట్స్ ఆటతీరుపై పై ఫుల్ ఫైర్ అయ్యారు. ఈవారం ఎవరి ఆటతీరు బాగోలేదని అసహనం వ్యక్తం చేశారు.
బాలాదిత్య, షాని, సుదీప, వాసంతి, శ్రీసత్య, మెరీనా -రోహిత్, అభినయశ్రీ, కీర్తి, శ్రీహన్.. వీరందరిని వెనకాల నించోమని సీరియస్ గా చెప్పారు నాగ్. ఇక సోఫాలో కూర్చున్న హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ.. ఫైమా తను ఓడినా, పక్కనవాళ్ళు గెలవకూడదు అని ఆడుతుంది అది తప్పు అని సీరియస్ అయ్యారు. చంటి జోకులు బాగా వేస్తున్నాడు కానీ ఆట మాత్రం ఆడట్లేదు, సూర్య హౌస్ కి గేమ్ ఆడటానికి వచ్చినట్లు లేదు, చిల్ అవ్వడానికి వచ్చినట్లు ఉంది, రేవంత్ జడ్జిమెంట్ చేస్తున్నట్లు కాకుండా తన ఆటపై ఫోకస్ చేయాలని, కెప్టెన్ రాజ్ ని అందర్నీ అడుక్కొని కెప్టెన్ అయ్యావని ఫైర్ అయ్యారు. ఇక వెనకాల నిలబెట్టిన వాళ్లందరిపై ఫైర్ అవుతూ అసలు మీ గురించి చెప్పడానికి ఏమి లేదు. మీలో ఇద్దరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు అని వాళ్లకి షాక్ ఇచ్చారు నాగార్జున.
ఇక వెనుక నిలబడిన 9 మందిలో ఎవరు వేస్టో వారి ముఖంపై స్టాంప్ వేసి చెప్పాలని.. మిగతా 11 మందిని అడుగుతాడు నాగార్జున. వారిలో శ్రీసత్య కి 3, షాని కి 3, వాసంతి కి మూడు వేస్ట్ స్టాంపులు పడుతాయి. ఆ ముగ్గురిలో.. ఆడియన్స్ ఒపీనియన్ తో మ్యాచ్ అయిన షానీ ఎలిమినేట్ అవుతాడు.
అనంతరం "ఒకే ఒక జీవితం" మూవీ లో తల్లికొడుకులుగా నటించిన అమల, శర్వానంద్ లు బిగ్ బాస్ స్టేజి పైకి వస్తాడు. బాలాదిత్య హౌస్ మేట్స్ ని వారిద్దరికి పరిచయం చేస్తాడు. రేవంత్ అమల-నాగార్జున కోసం హలో గురూ ప్రేమకోసమేరో జీవితం సాంగ్ పాడగా.. ఆర్జే సూర్య శర్వానంద్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిన ప్రభాస్, రామ్ చరణ్ వాయిస్ లను ఇమిటేడ్ చేసి ఇంప్రెస్ చేస్తాడు. ఇంతటితో శనివారం ఎపిసోడ్ ముగిసింది. నేటి ఎపిసోడ్ లో మరో ఎలిమినేషన్ ఉంది. నామినేషన్లలో ఉన్న వారిలో అభినయశ్రీ నేడు హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటికి వస్తుందని సమాచారం.
Next Story