Tue Dec 24 2024 01:07:27 GMT+0000 (Coordinated Universal Time)
Bigg Boss 6 Day 17 : ఇనయా ఓవరాక్షన్.. ఇద్దరు పోలీసుల్ని బంధీ చేసిన దొంగలముఠా
రెండో రౌండ్ గేమ్ ఆడే ముందు బిగ్ బాస్ ఆట నియమాలను హౌస్ మేట్స్ కి మరోసారి గుర్తుచేశాడు. పోలీసులు అడవిలోని బొమ్మలన్నింటిని..
బిగ్ బాస్ సీజన్ 6 17వ రోజు టెలీకాస్ట్ అయిన ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ కన్నా.. హౌస్ మేట్స్ ఒకరినొకరు తిట్టుకోవడం, తప్పులు ఎంచుకోవడంతోనే సరిపోయింది. ఎప్పటిలాగే గీతూ, రేవంత్ తమ నోటికి పని చెప్పి ఎదుటి వాళ్ళ మీద విరుచుకుపడ్డారు. గీతూ జోలికి ఎవరు వచ్చినా తిట్టేస్తుంది. దొరికిన వాళ్ళ వస్తువులన్నిటిని గీతూ దొంగిలించడం మొదలుపెట్టింది. తాను దొంగిలించినవాటిని ఓ సూట్ కేసులో దాచుకుంది. ఇక రేవంత్ వస్తువులు పోవడంతో రేవంత్ అందరిమీద ఫైర్ అయ్యాడు. దొంగలించినవాళ్ళకి సిగ్గుండాలి అంటూ గట్టిగానే తిట్టాడు. నేను కూడా ఎవర్ని వదిలిపెట్టను అంటూ వార్నింగ్ ఇచ్చాడు.
రెండో రౌండ్ గేమ్ ఆడే ముందు బిగ్ బాస్ ఆట నియమాలను హౌస్ మేట్స్ కి మరోసారి గుర్తుచేశాడు. పోలీసులు అడవిలోని బొమ్మలన్నింటిని దాచివేయగా.. వాటిని మళ్లీ అడవిలోనే ఉంచాలని సూచించాడు. దొంగల ఆట ముగియగానే.. ఇంట్లో రైడ్ చేస్తారు పోలీసుల టీమ్. ఈ రైడింగ్ లో ఇనయా, మరీనాలను దొంగల ముఠా బంధీ చేస్తుంది. రైడింగ్ సమయంలో ఇనయా తనను కొట్టిందని కంప్లైంట్ చేస్తుంది నేహా. అలాగే కీర్తితోనూ గొడవ పెట్టుకుంటుంది ఇనయ. బాత్రూమ్ లో దాక్కున్న అర్జున్ కల్యాణ్ దగ్గరున్న బొమ్మలను ఇచ్చేయమని అడుగుతుంది శ్రీసత్య. అర్జున్ తన బొమ్మలన్నింటినీ ఇచ్చేస్తాడు.
పింకీ, రేవంత్ మధ్య కూడా గొడవ అయింది. తన బొమ్మలను దొంగిలించడంతో హర్ట్ అయిన రేవంత్.. తనవద్దనున్న మిగిలిన వాటిని పోలీసులకు ఇచ్చేయాలని డిసైడ్ అవుతాడు. దాంతో సుదీప-రేవంత్ ల మధ్య గొడవ జరుగుతుంది. నీ బొమ్మలు పోయాయని చెప్పి టీం మొత్తాన్ని రిస్క్ లో పెట్టడం కరెక్ట్ కాదు అని పింకీ రేవంత్ తో గొడవ పెట్టుకుంది. రేవంత్ గోడ ఎక్కి పైన ఉన్న వస్తువులని తీసుకునేందుకు ట్రై చేస్తుంటే బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వడంతో దిగిపోతాడు. నేటి ఎపిసోడ్ లో దొంగల టీమ్ గెలుస్తుందా ? లేక పోలీస్ టీమ్ గెలుస్తుందా ? చూడాలి.
Next Story