Mon Dec 23 2024 18:13:33 GMT+0000 (Coordinated Universal Time)
Bigg Boss 6 Day 18 : ముగిసిన టాస్క్.. ఇనయాని రెచ్చగొట్టిన గీతూ-శ్రీహాన్.. హౌస్ లో మరో జోడి ?
కెప్టెన్సీ టాస్క్ లో గీతూ, శ్రీహాన్, ఆదిరెడ్డి, ఫైమా, శ్రీసత్య పోటీపడ్డారు. ఈ టాస్క్ కి రేవంత్ సంచాలకుడిగా ఉన్నాడు.
బిగ్ బాస్ సీజన్ 6 లో మూడవవారం కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ లో ఒక్కొక్కరు తమ స్ట్రాటజీలతో ఆడారు. కంటెస్టెంట్స్ కి ఇచ్చిన దొంగ-పోలీస్ టాస్క్ ఈ ఎపిసోడ్ లో ముగిసింది. ఈ టాస్క్ లో పోలీస్ టీమ్ గెలవగా.. బంగారు కొబ్బరిబోండాన్ని సాధించడంతో శ్రీసత్య నేరుగా కెప్టెన్సీ పోటీకి ఎంపికైంది. దొంగల నుంచి ఎక్కువ బొమ్మలు కొనుగోలు చేయడంతో పాటు.. ఎక్కువ క్యాష్ ఉన్న కారణంగా గీతూ కూడా ఎంపికైంది. ఇక మిగిలిన వారిని హౌస్ మేట్స్ ఎంచుకున్నారు. మొత్తం ఐదుగురు కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపికయ్యారు.
కెప్టెన్సీ టాస్క్ లో గీతూ, శ్రీహాన్, ఆదిరెడ్డి, ఫైమా, శ్రీసత్య పోటీపడ్డారు. ఈ టాస్క్ కి రేవంత్ సంచాలకుడిగా ఉన్నాడు. ఫస్ట్ టాస్క్ లోనే గీతూ ఎలిమినేట్ అవగా, గేమ్ రూల్స్ పాటించలేదని ఫైమాని ఎలిమినేట్ చేశాడు రేవంత్. ఈ విషయంలో ఫైమా-రేవంత్ ల మధ్య గొడవ జరిగింది. మధ్యలో ఇనయా వచ్చి శ్రీహాన్ కూడా తప్పు ఆడాడు అని కాసేపు హడావిడి చేసింది. వీరిద్దరిమధ్య కాసేపు గొడవ జరిగింది. దీంతో ఇనయా హౌస్ అంతా పరిగెడుతూ రచ్చరచ్చ చేసింది. ఏం సంబంధం లేకపోయినా గీతూ వచ్చి ఇనయాని అడ్డుకుంటూ ఎప్పటిలాగే హడావిడి చేసింది.
ఆదిరెడ్డి, శ్రీహాన్, శ్రీసత్య లలో ఎవరు కెప్టెన్ గా ఎంపికవుతారన్న విషయం నేడు తెలియనుంది. రేవంత్ .. ఎవరో ఏదో అన్నారని చిన్నపిల్లాడిలా అన్నం తినడం మానేసి.. హడావిడి చేశాడు. కెప్టెన్ గా ఉన్న రాజ్ తను అస్సలు పెళ్ళి చేసుకోవద్దు అనుకున్నానని కాని హౌస్ లోకి వచ్చిన తరువాత ఇక్కడ ఉన్న మెరీనా రోహిత్ లని చూసి పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నానని చెప్పాడు. దీంతో హౌస్ లో ఉన్న అమ్మాయిల్లో ఎవరితో లింక్ అంటూ కాసేపు రాజ్ ని అందరూ ఆడుకున్నారు. బాలాదిత్య ఒక్కొక్క అమ్మాయిని పిలిచి రాజ్ వైపు చూడమంటాడు. కీర్తి చూసేసరికి నవ్వేస్తాడు. దాంతో హౌస్ మేట్స్ రాజ్ ని ఆటపట్టించారు.
Next Story