Mon Dec 23 2024 18:08:38 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss6 Day 24 : ఓ వైపు కెప్టెన్సీ టాస్క్.. మరోవైపు పులిహోర కథలు
ఇక ఇందులో చంటికి బిగ్బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చినా అది చంటి చేయలేకపోయాడు. దీంతో చంటిని ఈ వారం కెప్టెన్సీ..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 నాల్గవవారం నామినేషన్లతో హౌసంతా హీటెక్కింది. బిగ్ బాస్ ఈ వారం హోటల్ వర్సెస్ హోటల్ పేరుతో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఇచ్చారు. ఒక హోటల్ ఐదుగురు అమ్మాయిలు నడపగా.. మరో హోటల్ లో సుదీప, గీతూ, బాలాదిత్య, మరీనా ఉన్నారు. మిగతా వారు గెస్ట్ లుగా ఉన్నారు. బుధవారం టెలీకాస్ట్ అయిన ఎపిసోడ్ లో సుదీప రన్ చేస్తున్న హోటల్ టీమ్ టాస్క్ లో ఓడిపోవడంతో.. దానిని హోటల్ గ్లామ్ ప్యారడైజ్ టీమ్ ఆధీనం చేసుకుంటుంది.
ఇక ఇందులో చంటికి బిగ్బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చినా అది చంటి చేయలేకపోయాడు. దీంతో చంటిని ఈ వారం కెప్టెన్సీ పోటీ నుంచి తప్పించాడు బిగ్బాస్. ఇక కంటెస్టెంట్స్ లో ఉన్న అమ్మాయిల్లో ఫైమా, శ్రీ సత్య, వసంతి, ఆరోహి, కీర్తి కలిసి రెండు హోటల్స్ నుంచి ఒక్కొక్కరిని కెప్టెన్సీ టాస్క్ నుంచి తప్పించమనడంతో అందరూ కలిసి రేవంత్, బాలాదిత్యలను కెప్టెన్సీ టాస్క్ నుంచి తప్పించారు. అంతకుముందు రేవంత్ తమ హోటల్ కి వచ్చిన ఇనయా కి కాళ్లు నొక్కుతాడు. అందుకు ఇనయ రేవంత్ కి డబ్బులిస్తుంది. ఈ విషయంలో రేవంత్ బాధపడతాడు.
పగటిపూట టాస్కులు ఆడుతూనే.. రాత్రి సమయంలో కొందరు కంటెస్టంట్స్ రెచ్చిపోతున్నారు. హౌస్ లో పులిహోర కథలు నడుస్తున్నాయి. రాజ్ పడుకుని ఉండగా.. ఇనయ అతని దగ్గరికి వెళ్లి.. కాళ్లపై పడుకొని గేమ్ గురించి మాట్లాడుతుంది. ఈ వ్యవహారంపై పెద్ద చర్చే జరుగుతోంది. ముందునుంచి ఊహించినట్లే అర్జున్ కల్యాణ్ శ్రీసత్య కోసం బాగా ట్రై చేస్తున్నాడు. కానీ.. శ్రీసత్య మాత్రం కేవలం గేమ్ కోసమే మాట్లాడుతున్నట్లు వ్యవహరిస్తోంది. బిగ్ బాస్ కి మంచి రేటింగ్ రాకపోవడం వల్లే బిగ్ బాస్ హౌస్ లో రొమాంటిక్ యాంగిల్ చూపిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది.
Next Story