Mon Dec 23 2024 19:47:02 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బాస్ డే 3 : నామినేషన్లలో ఏడుగురు.. ఇంటి సభ్యుల మధ్య మనస్పర్థలు
ఎప్పటిలాగే బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ మధ్య గొడవ పెట్టెలాగానే నామినేషన్స్ ప్రక్రియ పెట్టాడు. క్లాస్ టీం వాళ్ళు, ట్రాష్ టీం ద్వారా
బిగ్ బాస్ సీజన్ 6 లో మూడవ రోజు ఉదయం లైగర్ పాటతో మొదలైంది. ఆ తర్వాత అభినయశ్రీ పర్యవేక్షణలో రేవంత్ పాటకు ఇంటిసభ్యులు వర్షంలో గొడుగులతో డ్యాన్స్ చేశారు. భార్యభర్తలైన రోహిత్- మెరీనా ల మధ్య మిస్ మనస్పర్థలు వచ్చాయి. నువ్వు ఇంట్లో ఇలా ఉండేవాడివి కాదు.. ఇక్కడెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావ్ అని మెరీనా రోహిత్ పై అసహనం వ్యక్తం చేస్తుంది. రాత్రికి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ నామినేషన్లలో మొత్తం ఏడుగురు సభ్యులు హౌస్ నుంచి బయటికి వెళ్లేందుకు నామినేట్ అయ్యారు. సింగర్ రేవంత్, చంటి, శ్రీ సత్య, ఫైమా, ఇనయా సుల్తానా, ఆరోహి, అభినయశ్రీ నామినేషన్లలో ఉన్నారు.
ఎప్పటిలాగే బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ మధ్య గొడవ పెట్టెలాగానే నామినేషన్స్ ప్రక్రియ పెట్టాడు. క్లాస్ టీం వాళ్ళు, ట్రాష్ టీం ద్వారా ఆల్రెడీ నామినేషన్స్ కి వెళ్లిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్లంతా నామినేషన్ ప్రక్రియలో పాల్గొనాలి. అలాగే వాళ్ళని ఎందుకు నామినేట్ చేస్తున్నారో చెప్పి నామినేట్ చేయాలి అన్నాడు బిగ్‌బాస్. దీంతో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు మొదలయ్యాయి. మొదట సింగర్ రేవంత్ వచ్చి.. ఫైమా, ఆరోహిలను నామినేట్ చేశాడు. అందుకు రీజన్స్ చెప్పగా.. ఫైమా తనను తప్పుపట్టొద్దంటూ కౌటరిచ్చింది.
తర్వాత కీర్తి భట్ వచ్చి.. శ్రీహాన్, రేవంత్ లను నామినేట్ చేసింది. నాకు, శ్రీహాన్‌కు మధ్య ఉన్న బంధంపై రేవంత్ జోక్ చేశాడు. సరే అని నేను శ్రీహాన్‌ను చోటు భయ్యా అని పిలుస్తుంటే శ్రీహాన్ సరిగా మాట్లాడట్లేదు. అందుకే వీరిద్దర్నీ నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. అలాగే ఇంటిపనుల్లో భాగమవ్వట్లేదంటూ చంటిని కూడా నామినేట్ చేసింది. సుదీప.. రేవంత్ , చంటిలను, ఫైమా వచ్చి రేవంత్, అర్జున్ లను నామినేట్ చేశారు. నెక్ట్స్ వాసంతి వచ్చి రేవంత్, శ్రీసత్య లను నామినేట్ చేసింది. చంటి.. రేవంత్, సుదీప లను, ఆర్జే సూర్య.. రేవంత్, చంటి లను నామినేట్ చేశారు.
మెరీనా- రోహిత్ జంట ఫైమా, చంటి లను నామినేట్ చేశారు. శ్రీహాన్.. రేవంత్, కీర్తి లను, అర్జున్.. ఫైమా, ఆరోహి లను, రాజశేఖర్ .. వాసంతి, శ్రీసత్య లను, షాని శ్రీ సత్య, చంటి లను నామినేట్ చేశారు. హౌస్ ఎక్కువ మంది రేవంత్ నే నామినేట్ చేశారు. ఇక ట్రాష్ లో ఉన్న ముగ్గురిలో ఒకరిని నామినేషన్స్ నుంచి సేవ్ చేసే ఛాన్స్ క్లాస్ సభ్యులకు ఇచ్చాడు బిగ్ బాస్. దాంతో వారు బాలాదిత్యను మాస్ లోకి పంపి నామినేషన్ నుంచి సేవ్ చేశారు. మాస్ నుంచి ఆరోహి ని బాలాదిత్య ప్లేస్ లో నామినేట్ చేశారు. అలా మొదటి వారం ఇంటి సభ్యుల్లో ఏడుగురు నామినేట్ అయ్యారు. మరి ఈవారం ఎలిమినేషన్ ఉంటుందా ? తొలివారం అని ఎలిమినేషన్ క్యాన్సిల్ చేస్తారా ? తెలియాలంటే ఆదివారం వరకూ ఆగాల్సిందే.
Next Story