Mon Dec 23 2024 14:26:51 GMT+0000 (Coordinated Universal Time)
Bigg Boss 6 Day 37 : బ్యాటరీ రీ ఛార్జ్..ఫ్యామిలీతో మాట్లాడిన సుదీప, ఆదిరెడ్డి.. పాపం శ్రీహాన్
ముందుగా శ్రీహాన్ ను కన్ఫెషన్ రూమ్ కి పిలిచి.. మూడు ఆప్షన్లు ఇచ్చాడు బిగ్ బాస్. నాన్నతో వీడియోకాల్ మాట్లాడేందుకు 35 శాతం ..
బిగ్ బాస్ 6 లో 37వ రోజు ఎమోషనల్ గా సాగింది. ముందుగా ఈ వారం ఎలిమినేషన్ పై ఎవరికి వారే అంచనాలు వేసుకోవడం మొదలుపెట్టారు. రేవంత్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని జోస్యం చెప్పగా.. గీతూ.. కీర్తి, సుదీపలు ఎలిమినేట్ అవ్వొచ్చని చెప్పింది. ఈ ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ లు మొదలుపెట్టాడు. ఈ సారి కొంచెం ఎమోషనల్ గా ఉండే టాస్క్ ని తీసుకున్నాడు బిగ్బాస్. ఈ టాస్క్ లో పాస్ అయిన వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారు. గార్డెన్ లో 100 శాతం ఉన్న బ్యాటరీని పెట్టి.. ఒక్కొక్క కంటెస్టంట్ కు బిగ్ బాస్ టాస్క్ లు ఇచ్చాడు. షరతు ఏంటంటే.. బిగ్ బాస్ ఇచ్చిన మూడు టాస్కుల్లో ఏదొ ఒకటైనా ఎంచుకోవాల్సిందే.
ముందుగా శ్రీహాన్ ను కన్ఫెషన్ రూమ్ కి పిలిచి.. మూడు ఆప్షన్లు ఇచ్చాడు బిగ్ బాస్. నాన్నతో వీడియోకాల్ మాట్లాడేందుకు 35 శాతం బ్యాటరీ, సిరి ఆడియో మెసేజ్ కోసం 30 శాతం బ్యాటరీ, ఇంటి ఫుడ్ తీనేందుకు 15 శాతం ఛార్జింగ్ తగ్గిపోతుందని తెలిపారు. ఫుడ్ కి తక్కువ శాతం బ్యాటరీ ఉండటంతో శ్రీహాన్ ఫుడ్ ని ఎంచుకున్నాడు. నెక్స్ట్ సుదీప..కి ఆమె భర్తతో మాట్లాడే అవకాశం కావాలంటే 30శాతం, భర్త పంపిన టీషర్ట్ పొందాలంటే 40శాతం, అమ్మ చేసిన చికెన్ కర్రీ పొందాలంటే 35శాతం బ్యాటరీ ఖర్చు అవుతుందని చెప్పడంతో సుదీప భర్తతో ఆడియో కాల్ మాట్లాడింది.
ఆ తర్వాత ఆదిరెడ్డికి భార్య, కూతురుతో వీడియో కాల్ మాట్లాడేందుకు 40శాతం, భార్యతో ఆడియో కాల్కి30 శాతం, కూతురి ఫొటో ఉన్న టీ షర్ట్ కావాలంటే 35 శాతం బ్యాటరీని వాడాల్సి ఉంటుందని చెప్పాడు. ఎమోషనల్ అయిన ఆదిరెడ్డి తన కూతురు, భార్యతో మాట్లాడేందుకు ఓకే చెప్పాడు. వారిద్దరితో వీడియో కాల్ మాట్లాడి 40 శాతం బ్యాటరీ ఛార్జింగ్ ని వదులుకున్నాడు. ఈ క్రమంలో తన భార్య, కూతురుతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు ఆదిరెడ్డి.
శ్రీహాన్ కు ఇంటి నుంచి మటన్ బిర్యాని, చికెన్ ఫ్రై రాగా.. అప్పటి వరకూ హౌస్ లో ఉన్నవారితో తనకు ఎలాంటి రిలేషన్ లేదని, ఉండదని చెప్తూ వచ్చిన గీతూ.. బిర్యాని చూసి టెంప్ట్ అయింది. శ్రీహాన్ అన్నయ్య మన అమ్మ మన కోసం బిర్యాని పంపింది.. నేను నాన్ వెజ్ తినను.. కానీ టేస్ట్ చేస్తానంటూ బిర్యానీ కోసం తెగ ఆరాటపడింది. గీతూ చేసిన ఈ హడావిడి చూసిన హౌస్ మేట్స్ నవ్వుకున్నారు. కీర్తి.. శ్రీసత్య, వాసంతిల ముందు గీతూ ఇలా చేస్తుందంటూ యాక్ట్ చేసి చూపించింది.
Next Story