Mon Dec 23 2024 19:49:27 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బాస్ 6 డే 4 : వామ్మో ఈ ఇంట్లో నేనుండలేనన్న రేవంత్.. వెక్కి వెక్కి ఏడ్చిన ఆరోహి
ఇప్పటికే క్లాస్ టీంలో ఉన్న ముగ్గురు కెప్టెన్సీ పోటీకి డైరెక్ట్ గా వెళ్లిపోయారు. మాస్ టీంలోంచి మరో ముగ్గుర్ని కెప్టెన్సీ..
ఈ సారి బిగ్ బాస్ సీజన్.. ఆది నుంచి రసవత్తరంగానే ఉంది. మొదటి వారం నామినేషన్స్ కి ముందే గొడవలు, ఏడుపులు.. నామినేషన్ల తర్వాత మరింత ఎక్కువయ్యాయి. నాలుగురోజులకే మేం వెళ్లిపోతామంటూ ఏడ్చేస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసినా.. నాల్గవ రోజూ నామినేషన్ల గురించే చర్చ జరిగింది. కంటెస్టంట్ల మధ్య బేధాబిప్రాయాలు వచ్చి గ్రూపులుగా విడపోయారు. నామినేషన్ల నుంచి సేఫ్ అయిన వారిలో గీతూ మరీ ఓవర్ చేస్తుందన్న టాక్ వచ్చింది. ఈ వారం కాకపోతే.. వచ్చేవారమైనా ఆమె ఇంటి నుంచి వెళ్లిపోతుందని అంటున్నారు.
ఎప్పటిలాగానే గీతూ అరుస్తూ, కౌంటర్లేస్తు, తానే డామినేట్ గా ఉండాలని ప్రయత్నించింది. గీతూ మాటలకి చంటి ఇన్వాల్వ్ అవ్వడంతో ఇద్దరి మధ్య కాసేపు గొడవ జరిగింది. నాల్గవరోజు ఎపిసోడ్ హైలెట్ గా నిలిచాడు రేవంత్. నామినేషన్స్ రోజు కంటెస్టెంట్స్ అంతా రేవంత్ ని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. చాలా మంది రేవంత్ ని నామినేట్ చేశారు. దీంతో రేవంత్ బాధపడ్డాడు. రేవంత్ కి బాలాదిత్య మోటివేషన్ ఇచ్చాడు.
ఇప్పటికే క్లాస్ టీంలో ఉన్న ముగ్గురు కెప్టెన్సీ పోటీకి డైరెక్ట్ గా వెళ్లిపోయారు. మాస్ టీంలోంచి మరో ముగ్గుర్ని కెప్టెన్సీ పోటీకి హౌస్ లో ఉన్న వాళ్లంతా సెలెక్ట్ చేయాలని బిగ్బాస్ చెప్పడంతో రోహిత్ అండ్ మెరీనా, ఆర్జే సూర్య, బాలాదిత్యలని కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపిక చేశారు. ఆ తర్వాత బిగ్బాస్ కంటెస్టెంట్స్ ని రెండు టీమ్స్ గా విడగొట్టి సినిమాలకి సంబంధించిన ప్రశ్నలు అడిగాడు. అయితే ఇందులో ఒక టీం ఓడిపోవడంతో ఆ టీంలో ఉన్న ఆరోహి ఎమోషనల్ అయితే అదే టీంలో ఉన్న రేవంత్ ఆరోహి వల్లే ఓడిపోయాం అనడంతో వీరిద్దరి మధ్య గొడవ అయ్యింది.
మరో సందర్భంలో ఆదిరెడ్డితో గొడవపడ్డాడు. ఇలా రోజంతా హైలెట్ అయిన రేవంత్.. చివరిలో కెమెరా ముందుకొచ్చి ఏడుస్తూ.. హౌస్ లో నా వల్లే సమస్యగా ఉంటే నన్ను పంపించేయండి. నేను అందరిలా నటిస్తూ.. ఒకర్ని సంతోష పెట్టడం కోసం నా క్యాెరెక్టర్ ను నేను చంపుకోలేను. ఇక్కడ చాలామంది గ్రూప్గా ఆడుతున్నారు. నేను సింగిల్గా ఎన్నిరోజులైనా ఆడతాను. ఇలాంటి వాళ్ళ మధ్య నేను ఉండటం కరెక్ట్ కాదు. నన్ను పంపించేయండి అంటూ ఎమోషనల్ అయ్యాడు. అంతకుముందు ఆరోహి రేవంత్ అన్న మాటలకు వెక్కి వెక్కి ఏడ్వగా.. ఆర్జే సూర్య ఓదార్చి, ఎవరితో ఎలా మాట్లాడాలో మోటివేట్ చేశాడు.
Next Story