Mon Dec 23 2024 14:20:26 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 : గీతూతో ఒక ఆట ఆడుకున్న నాగార్జున.. సుదీప ఎలిమినేట్, ఫుల్ జోష్ లో రేవంత్
బొమ్మలని చూసి సాంగ్స్ గెస్ చేసే గేమ్ ఇచ్చారు. హౌజ్ లోని సభ్యులని రెండు టీములుగా విడగొట్టి ఈ ఆటని ఆడించారు. గెస్ చేసిన..
బిగ్ బాస్ సీజన్ 6 ఆరువారాలు పూర్తి చేసుకుంది. ఆరోవారం సుదీప హౌస్ నుండి ఎలిమినేట్ అయింది. ఆదివారం టెలీకాస్ట్ అయిన ఎపిసోడ్.. నామినేషన్స్ లో ఉన్నవారిని సేవ్ చేయడంతో మొదలైంది. శనివారం శ్రీసత్య సేఫ్ అయిన విషయం తెలిసిందే. ఇక నాగార్జున హౌస్ మేట్స్ పై సెటైర్లు వేస్తూ.. ఆడియన్స్ ని నవ్వించారు. ముఖ్యంగా గీతూతో బాగా ఆడుకున్నారు. హౌస్ లో పనిదొంగ అయిన గీతూకి.. స్టోర్ రూమ్ కి వెళ్లి అది తీసుకురా.. ఇది తీసుకురా అని చెప్పడంతో ఇంటిసభ్యులంతా గీతూని చూసి ఎంజాయ్ చేశారు.
బొమ్మలని చూసి సాంగ్స్ గెస్ చేసే గేమ్ ఇచ్చారు. హౌజ్ లోని సభ్యులని రెండు టీములుగా విడగొట్టి ఈ ఆటని ఆడించారు. గెస్ చేసిన పాటలని ప్లే చేసి సభ్యులచే డ్యాన్సులు వేయించారు. టీమ్ బి గెలవగా.. బిగ్ బాస్ వారికి కానుకను పంపారు. ఆ తర్వాత కొన్ని డైలాగ్స్ ఇచ్చి వాటిని ఒక్కొక్కరిగా ఇంటి సభ్యులకి డెడికేట్ చేయమన్నారు నాగార్జున. మళ్లీ ఎలిమినేషన్ ప్రాసెస్ మొదలు పెట్టారు. ఒక్కొక్కరినీ సేవ్ చేస్తూ రాగా.. చివరికి బాలాదిత్య- సుదీప మిగిలారు. వీరిద్దరికి రెండు బ్యాటరీలు ఇచ్చారు. ఎవరి బ్యాటరీ ఛార్జింగ్ లేకపోతే వాళ్ళు ఎలిమినేట్ అని చెప్పారు నాగార్జున. సుదీప బ్యాటరీలో ఛార్జింగ్ తగ్గిపోవడంతో సుదీప ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు.
ఎలిమినేషన్ తర్వాత స్టేజిపైకి వచ్చిన కంటెస్టంట్ కి హౌస్ మేట్స్ గురించి చెప్పమంటూ ఓ టాస్క్ ఇవ్వడం మామూలే. సుదీపకి కూరగాయలు టాస్క్ ఇవ్వగా.. ఒక్కొక్కరికీ ఒక్కోరకం వెజిటబుల్ ఇచ్చి రీజన్ చెప్పింది. ఇలా వీకెండ్ ఎలిమినేషన్ ఎపిసోడ్ సాగిపోయింది. ఈ వారం నామినేషన్స్ లో దాదాపు హౌస్ మేట్స్ మొత్తం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎవరెవరు నామినేషన్ జోన్లో ఉంటారో చూడాలి.
Next Story