Mon Dec 23 2024 14:12:05 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 Day 45 : శ్రీహాన్ కి షాకిచ్చిన ఇనయ.. హౌస్ లో దొంగలు.. అసలు సిసలైన ఆట మొదలైంది
ఉప్పు, పంచదార సహా.. ఇంట్లో ఉన్న సరుకులు, తినుబండారాలు, ఫ్రూట్స్ అన్నింటినీ దోచుకెళ్లారు. ఆఖరికి మైక్రోవేవ్ ఓవెన్..
బిగ్ బాస్ హౌస్ లో అసలు సిసలైన ఆట మొదలైంది. సీజన్ మొదలై ఆరువారాలు పూర్తయినా.. కంటెస్టంట్స్ గేమ్ పై దృష్టి పెట్టకుండా.. సోది యవ్వారాలన్నీ చేస్తున్నారు. బిగ్ బాస్ టీఆర్పీ కూడా దారుణంగా పడిపోయింది. ఈవారం కెప్టెన్సీ టాస్క్ లో హౌస్ మేట్స్ విఫలమయ్యారంటూ బిగ్ బాస్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయినా కూడా హౌస్ మేట్స్ లో ఏమాత్రం మార్పు రాలేదు. నిన్న టెలీకాస్ట్ అయిన ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ ని బెడ్ రూమ్ లో పెట్టి లాక్ చేసి.. దొంగల్ని పంపించాడు బిగ్ బాస్.
ఉప్పు, పంచదార సహా.. ఇంట్లో ఉన్న సరుకులు, తినుబండారాలు, ఫ్రూట్స్ అన్నింటినీ దోచుకెళ్లారు. ఆఖరికి మైక్రోవేవ్ ఓవెన్, గ్యాస్ కనెక్షన్, స్నానాలకి వేడినీళ్లను కూడా కట్ చేశాడు. మంచినీరు తప్ప ఇంట్లో ఏదీ ఉండకుండా చేశాడు బిగ్ బాస్. కొద్దసేపటికి ఒక గిన్నెలో అన్నం.. మరో గిన్నెలోపప్పు ఉంచి.. అది కావాలంటే రెండు టీమ్ లు కబడ్డీ ఆడి గెలుచుకోవాలని చెప్పాడు బిగ్ బాస్. గెలుచుకున్న ఫుడ్ ని వేరే వాళ్ళతో షేర్ చేసుకోకుండా తినాలి అని బిగ్బాస్ చెప్పాడు. ఆ తర్వాత మరో టాస్క్ లో చపాతీలు, కూర పంపించి బాల్స్ తో టగ్ ఆఫ్ వార్ గేమ్ ఆడించాడు. ఈ సారి కూడా రెండు టీమ్స్ లాగే ఆడారు. మరో టీం చపాతీలని గెలుచుకుంది. అయితే బిగ్బాస్ చెప్పిన ఫుడ్ షేర్ చేసుకోకూడదు అనే రూల్ ని బ్రేక్ చేసి ఆదిరెడ్డి వేరే టీంలో ఉన్న గీతూకి బంగాళదుంప కూర పెట్టాడు.
దాంతో ఆదిరెడ్డి- గీతూలకు బిగ్ బాస్ అంట్లు తోమే పనిష్మెంట్ ఇచ్చాడు. వాళ్లిద్దరూ గిన్నెలు కడుగుతుంటే.. హౌస్ మేట్స్ పేరడీ సాంగ్స్ తో ఆటపట్టించారు. చిన్న బంగాళదుంప ముక్క పెడితే.. దానిని బిగ్ బాస్ ఫుడ్ షేరింగ్ అనడం హర్టింగ్ ఉందన్నాడు ఆదిరెడ్డి. వీళ్లిద్దరికి ఇచ్చిన పనిష్మెంట్ ప్రేక్షకులకు నవ్వులు తెప్పించింది. ఎపిసోడ్ మొదట్లో.. సూర్య ఇనయ తనకిచ్చిన క్యారెక్టర్ సరిగ్గా చేయలేదనడంతో ఆమె హర్ట్ అయి సూర్యతో మాట్లాడటం మానేసింది. శ్రీహాన్ - సూర్య కిచెన్ లో మాట్లాడుకుంటుండగా.. ఇనయ వెళ్లి శ్రీహాన్ కు సారీ చెప్పింది. తనను నామినేట్ చేశాడనే శ్రీహాన్ ను వాంటెడ్ గా నామినేట్ చేశానని, ఇంట్లో ఉన్నవారందరిలో శ్రీహాన్ గేమ్ బాగా ఆడుతున్నాడని చెప్పింది ఇనయ. అది విన్న శ్రీహాన్ షాకయ్యాడు.
Next Story