Mon Dec 23 2024 13:07:48 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 Day 61 : గీతూ వల్ల గేమ్ కోల్పోయిన ఆదిరెడ్డి .. మరోసారి రేవంత్ పై నోరుజారిన ఇనయా
మరోసారి ఇరు టీమ్ లు టీ షర్ట్ పై స్ట్రైప్స్ పీకేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో.. ఇనయా అవతల టీం వాళ్ళని కొట్టడానికి ట్రై..
బిగ్ బాస్ సీజన్ 6లో 9వ వారం కెప్టెన్సీ టాస్క్ జరుగుతున్న విషయం తెలిసిందే. కంటెస్టెంట్స్ ని రెండు టీమ్ లుగా విడగొట్టి టాస్కులిచ్చాడు బిగ్ బాస్. గేమ్ లో చనిపోయిన కంటెస్టంట్స్ భౌతికంగా ఆడలేరని బిగ్ బాస్ చెప్పినా.. గీతూమాత్రం తన సొంత రూల్స్ పెట్టుకుని గేమ్ ఆడుతోంది. గీతూ గత ఎపిసోడ్ లో ఆదిరెడ్డి టిషర్ట్ ని కొట్టేసింది. గీతూ గేమ్ లో లేకపోయినా ఆదిరెడ్డి షర్ట్ కొట్టేయడంతో ఆదిరెడ్డి ఫైర్ అయ్యాడు. గేమ్ పక్కన పెట్టి పర్సనల్ గా ఆడుతున్నావంటూ ఫైర్ అయ్యాడు. దీనిపై కాసేపు గీతూ, ఆదిరెడ్డి మధ్య వివాదం జరిగింది. నువ్వు రూల్స్ ఫాలో అవ్వకుండా ఆడుతున్నావు ఏదో ఒకరోజు నిన్ను ఏడిపిస్తానంటూ ప్రామిస్ చేశాడు.
మరోసారి ఇరు టీమ్ లు టీ షర్ట్ పై స్ట్రైప్స్ పీకేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో.. ఇనయా అవతల టీం వాళ్ళని కొట్టడానికి ట్రై చేయగా రేవంత్ ఆమెని పడేశాడు. దీంతో ఇనయా ఏడుస్తూ అందరూ నన్ను కావాలని టార్గెట్ చేశారు అని కాసేపు అరిచింది. రేవంత్ ను అనకూడని మాటలు అంది. ఈ విషయమై నాగార్జున ఈరోజు ఇనయాకు క్లాస్ తీసుకుంటారో లేదో చూడాలి. ఇక ఇనయ ఏడుపులు, అరుపులకు ఎప్పటిలాగే శ్రీహాన్ కౌంటర్లు వేశాడు. ఇరు టీమ్ లు గొడవలు పడుతుండగా గేమ్ పాస్ చేశారు. అందరినీ లివింగ్ రూమ్ లోకి పిలిచి.. గీతూ ఆదిరెడ్డి టీషర్ట్ దొంగిలించడం తప్పని చెప్పారు. కానీ.. ఆదిరెడ్డి టీ షర్ట్ తో పాటు తన మైక్ ను విసిరేయడంతో కెప్టెన్సీ రేసులో పాల్గొనేందుకు అనర్హుడిగా ప్రకటించారు.
మిషన్ ఇంపాజిబుల్ అనే టాస్క్ లో రెండు టీమ్స్ ఈక్వల్ స్కోర్ చేయగా టై అవ్వడంతో ఫైనల్ టాస్క్ పోటీకి ఎవర్ని పంపిస్తారో మీరే తేల్చుకోండి అని రెండు గ్రూపులకి చెప్పాడు బిగ్బాస్. దీంతో రెండు టీంల నుంచి శ్రీసత్య, ఇనయ, మెరీనా, ఫైమా, వాసంతి, గీతూలు ఫైనల్ కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొన్నారు. చివరిగా ఒక్కొక్కరికి బెలూన్ ఇచ్చి మీ బెలూన్ కాపాడుకుంటూ అవతలి వాళ్ళ బెలూన్ ని పగలకొట్టాలి అని చెప్పారు. దీంతో ఇది కూడా ఫిజికల్ టాస్క్ గా మారింది. అమ్మాయిలంతా అవతలి వాళ్ళ బెలూన్ ని పగలకొట్టడానికి కొట్టుకున్నారు. చివరిగా ఈ టాస్క్ లో శ్రీసత్య గెలిచి ఈ వారం కెప్టెన్ గా నిలిచింది.
Next Story