Thu Dec 26 2024 11:29:07 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బాస్ 6 డే 7 : నో ఎలిమినేషన్.. సన్ డే ఫన్ డే.. ఐటమ్ సాంగ్స్ తో ఆడిపాడిన హౌస్ మేట్స్
ఆదివారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఒక్కొక్కరినీ సేవ్ అవ్వగా.. చివరికి ఇనయా సుల్తానా, అభియనశ్రీ ఉన్నారు. వీరిద్దరిని ..
బిగ్ బాస్ సీజన్ 6 విజయవంతంగా తొలివారం పూర్తిచేసుకుంది. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్లలో ఉన్న కంటెస్టంట్లంతా సేఫ్ అయ్యారు. హౌస్ మేట్స్ అందరికీ సన్ డే ఫన్ డే అయింది. మొదటివారం చంటి, రేవంత్, శ్రీ సత్య, ఆరోహి, ఇనయా, అభినయశ్రీ, ఫైమా ఎలిమినేషన్కి నామినేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. ఎప్పటిలాగే ఆదివారం నాడు ఈ ఎలిమినేషన్ లో ఉన్న వాళ్లలో ఒకర్ని బయటకి పంపించేస్తారు అనుకున్నారు అంతా. కానీ ఈ సారి బిగ్బాస్ ఎప్పుడూ లేని ట్విస్ట్ ఇచ్చాడు.
ఆదివారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఒక్కొక్కరినీ సేవ్ అవ్వగా.. చివరికి ఇనయా సుల్తానా, అభియనశ్రీ ఉన్నారు. వీరిద్దరిని నాగార్జున గార్డెన్ ఏరియాకి పిలిచి అక్కడున్న రెండు భారీ సుత్తులని ఎత్తమన్నారు. ఎవరు సుత్తిని ఎత్తలేకపోతే వారు ఎలిమినేట్ అవుతారు అని చెప్పాడు నాగ్. అయితే ఇద్దరూ సుత్తిలని ఎత్తారు. ఇద్దరూ సేఫ్ .. ఈ వారం ఎలిమినేషన్ లేదు అని నాగార్జున తెలిపారు.
కంటెస్టంట్లకు రెండు గేమ్ లు పెట్టారు నాగార్జున. ముందుగా స్టార్ ఆఫ్ ది వీక్ కండక్ట్ చేశారు. ఇందులో హౌజ్ మేట్స్ గురించి ఎవరు కరెక్ట్ గా, ఎక్కువ సమాధానాలు చెప్తే వాళ్ళు విన్నర్. ఈ గేమ్ లో మొదటి వారం కెప్టెన్గా ఎన్నికైన బాలాదిత్య ఎక్కువ సమాధానాలు కరెక్ట్ గా చెప్పి విన్నర్గా నిలిచాడు. దీంతో బాలాదిత్యకి బిగ్బాస్ ఓ గిఫ్ట్ ని పంపించాడు. దానిని బాలాదిత్య మాత్రమే వాడుకోవాలని నాగార్జున కండిషన్ పెట్టారు.
ఆ తర్వాత.. ఐటమ్ సాంగ్ రౌండ్ లో బుట్టబొమ్మ పాట రాగా.. హౌస్ లో ఉన్న అమ్మాయిల గురించి చెప్పమని నాగార్జున బాలాదిత్యను అడిగారు. మరీనా బుట్టబొమ్మ అని, గీతూ రాయల్ సీతమ్మ అని, శ్రీ సత్య పువ్వు అని, ఆరోహి థౌజండ్ వాలా అని, వాసంతి బ్యూటిపుల్ అని, నేహా స్ప్రింగ్ అని, ఫైమా ఎంటర్ టైనర్ అని చెప్పాడు. సాంగ్స్ రౌండ్ లో ఎ అండ్ బి రెండు టీమ్ లుగా విభజించారు. మధ్యలో బజర్ పెట్టారు. నాగార్జున చూపించే ఐటమ్ తో ఉన్న సాంగ్ పాడాలి. ఎవరు బజర్ నొక్కి కరెక్ట్ గా పాడితే ఆ టీమ్ కి పాయింట్. ఈ గేమ్ లో టీమ్ ఎ 15 పాయింట్లతో గెలిచింది. అలా బిగ్ బాస్ 6 ఫస్ట్ సన్ డే ఫన్ డే గా గడిచింది.
Next Story