Mon Dec 23 2024 09:50:14 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 Day 77 : మెరీనా ఎలిమినేట్.. బాటమ్ 5 లిస్టులో ఆ నలుగురు
11వ వారం ఎలిమినేషన్ కూడా పూర్తయింది. ఈ ఎలిమినేషన్ తో హౌస్ లో ఉన్న జంట రోహిత్- మెరీనా లను విడదీశాడు బిగ్ బాస్.
బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలేకు ఎంతో సమయం లేదు. ముగింపు దగ్గరపడే కొద్దీ.. కంటెస్టంట్స్ మధ్య గేమ్ రసవత్తరంగా సాగుతోంది. గీతూ ఎలిమినేషన్ నుండి.. హౌస్ మేట్స్ అలర్టయ్యారు. బెస్ట్ ప్లేయర్ అనుకున్నవారు ఎలిమినేట్ అవుతుండటంతో.. గేమ్ సీరియస్ గా ఆడుతున్నారు. ఇక శనివారం నాటి ఎపిసోడ్ లో నాగార్జున ఆదిరెడ్డికి క్లాస్ తీసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం.. షరా మామూలుగా ఎలిమినేషన్ జరిగింది.
11వ వారం ఎలిమినేషన్ కూడా పూర్తయింది. ఈ ఎలిమినేషన్ తో హౌస్ లో ఉన్న జంట రోహిత్- మెరీనా లను విడదీశాడు బిగ్ బాస్. ఓటింగ్ తక్కువ రావడంతో మెరీనా ఎలిమినేట్ అయింది. అంతకుముందు.. సన్ డే ఫన్ డే లో భాగంగా.. నాగార్జున హౌస్ మేట్స్ ను రెండు టీమ్ లుగా విడదీసి గేమ్ పెట్టారు. ఈ గేమ్ లో టీమ్ శ్రీహాన్ టీమ్ గెలవగా.. శ్రీసత్య టీమ్ ఓడిపోయింది. అలాగే కంటెస్టంట్స్ ఒక్కొక్కరినీ కన్ఫెషన్ రూమ్ కి పిలిచి టాప్ 5, బాటమ్ 5 లిస్ట్ చెప్పమన్నారు. హౌస్ మేట్స్ అభిప్రాయం ప్రకారం.. బాటమ్ 5 లిస్ట్ లో ఇనయ, కీర్తి, రాజ్, మెరీనా, రోహిత్ ఉన్నాు. మిగతా ఐదుగురు రేవంత్, శ్రీహాన్, శ్రీసత్య, ఫైమా, ఆదిరెడ్డి టాప్ 5లో ఉన్నారు.
బాటమ్ 5లో ఉన్నవారిలో మెరీనా ఎలిమినేట్ అయింది. హౌస్ నుండి బయటికి వచ్చాక.. మెరీనాకు ఓ టాస్క్ ఇచ్చారు నాగ్. 9 మందిలో ఎవరు ప్యూర్, ఎవరు ఇంప్యూర్ చెప్పమన్నారు. ఇంప్యూర్ లిస్టులో శ్రీసత్య, ఇనయ, శ్రీహాన్, ఫైమా లను ఉంచింది మెరీనా. ఇనయ నోరు కొంచెం తగ్గించుకోవాలని సూచించింది. అలాగే ఫైమా కూడా అప్పుడప్పుడు మాటలు వదిలేస్తుంటుందని, దాని వల్ల ఎదుటివారు హర్టవుతారని చెప్పింది. శ్రీహాన్ గురించి చెబుతూ.. కోపం వచ్చినపుడు కొంచెం కంట్రోల్ గా ఉండాలని సలహా ఇచ్చింది.
Next Story