Mon Dec 23 2024 08:12:01 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 Day 84 : ఫైమాకి బదులు రాజ్ అవుట్.. విన్నర్ రేవంతా ?
ఇనయా మాట్లాడుతూ.. శ్రీసత్య గేమ్‌ను లైట్‌గా తీసుకుంటుంది. రేవంత్ ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతాడు. రాజ్ ప్రతిదానికి నేనున్నానని
బిగ్ బాస్ సీజన్ 6లో 12 వారాలు పూర్తయ్యాయి. ఈ వారమంతా ఫ్యామిలీ ఎపిసోడ్స్ తో గేమంతా ఎమోషనల్ గా సాగింది. ఆఖరి కెప్టెన్ గా ఇనయ తన కోరికను నెరవేర్చుకుంది. ఇక సన్ డే ఫన్ డే లో భాగంగా ఎప్పటిలాగే రెండు టీమ్ లతో నాగార్జున సాంగ్స్ తో గేమ్ ఆడించాడు. మొదట ఒక్కొక్క హౌస్ మేట్ ని.. నలుగురు ఎవరైనా హౌస్ మేట్స్ కి ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ గురించి చెప్పమన్నాడు నాగార్జున. ముందుగా రోహిత్ మాట్లాడుతూ.. కీర్తి ఎక్కువగా బాధపడుతుంది, ఫైమా, శ్రీసత్యలలో వెటకారం ఎక్కువ. ఇనయా ఎవరికీ అవకాశమివ్వకుండా మాట్లాడుతుంది, రాజ్ పాయింట్ లేకున్నా అరుస్తాడు, రేవంత్‌కు కోపమెక్కువ. ఇక శ్రీహాన్ గేమ్ కన్నా ఫ్రెండ్షిప్కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు అని చెప్పాడు.
ఆ తర్వాత ఇనయ మాట్లాడుతూ.. ఇనయా మాట్లాడుతూ.. శ్రీసత్య గేమ్‌ను లైట్‌గా తీసుకుంటుంది. రేవంత్ ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతాడు. రాజ్ ప్రతిదానికి నేనున్నానని చూపించుకోవడానికి అరుస్తాడు. ఆదిరెడ్డి గేమ్ ఆడకుండా కూర్చోవడం కరెక్ట్ కాదు అని చెప్పింది. కీర్తి.. రేవంత్ కి కోపం బాగా ఎక్కువ. శ్రీసత్య, శ్రీహాన్ లకి వెటకారం ఎక్కువ, రోహిత్ ఎవరితోనూ కలవడు అని చెప్పింది. ఆదిరెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ ఆడినా నేను ఆడాను అని నిరూపించుకోవడానికి ట్రై చేస్తాడు. ఇనయా తన నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తుంది. శ్రీసత్యకు కాన్ఫిడెన్స్ లేదు. రోహిత్ అస్సలు మాట్లాడడు అని చెప్పాడు.
ఫైమా.. రేవంత్ కి కోపం ఎక్కువ, ఇనయాకి సరిగ్గా మాట్లాడటం రాదు. రోహిత్ పర్ఫామెన్స్ గేమ్ లో కనిపించట్లేదు. కీర్తి ప్రతిదానికి ఎమోషనల్ అవుతుంది అని చెప్పింది. శ్రీసత్య.. రోహిత్ రియాక్ట్ అవ్వాల్సిన టైమ్‌కు రియాక్ట్ అవ్వడు. కీర్తి ఏం చెప్పినా వినిపించుకోదు. ఇనయా ఎదుటివాళ్లకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వదు. శ్రీహాన్ గేమ్ కన్నా ఫ్రెండ్షిప్కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు అని చెప్పింది. రాజ్ మాట్లాడుతూ.. రోహిత్ గట్టిగా మాట్లాడడు. ఇనయ ప్రతిదానిలో దూరుతుంది. శ్రీహాన్ గేమ్ కన్నా స్నేహానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు. శ్రీసత్య నామినేషన్లో కరెక్ట్ పాయింట్ మాట్లాడదు అన్నాడు.
శ్రీహాన్.. రాజ్‌కు కాన్ఫిడెన్స్ తక్కువ. రోహిత్ మంచితనం అన్నిచోట్లా పనికిరాదు. రేవంత్ ఏది పడితే అది మాట్లాడతాడు. శ్రీసత్య వేరేవాళ్ల మాట నమ్మి ఫ్రెండ్‌ను దూరం పెడుతుంది అని చెప్పాడు.రేవంత్.. ఫైమా ఇంకా వెటకారం తగ్గించుకోలేదని, ఆదిరెడ్డి మానిప్యులేటర్ అని, ఇనయ, కీర్తి కావాలని ఎదుటివారిని రెచ్చగొడుతారని చెప్పాడు. ఆ తర్వాత ఒక గేమ్ ఆడించిన నాగ్.. ఎలిమినేషన్ ప్రాసెస్ మొదలుపెడతాడు. ఫైమా-రాజ్ ల మధ్య ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఫైమా దగ్గర ఎవిక్షన్ పాస్ ఉండగా.. అది నీ కోసం వాడుకుంటావా లేక రాజ్ కి ఇస్తావా ? అని అడుగుతాడు. ఫైమా కన్ఫ్యూజన్ లో ఉండగా.. హౌస్ మేట్స్ అభిప్రాయం తీసుకోమంటాడు. రాజ్ సహా.. హౌస్ మేట్సంతా ఫైమానే వాడుకోవాలని చెప్తారు.
దాంతో ఫైమా సేవ్ అయి, రాజ్ ఎలిమినేట్ అవుతాడు. ఫైమా తన కోసం, రాజ్ కోసం ఆ పాస్ ని వాడకపోయి ఉన్నా, రాజ్ కోసం ఇచ్చేసినా ఓటింగ్ ప్రకారం ఫైమానే ఎలిమినేట్ అయి ఉండేది.
Next Story