Mon Dec 23 2024 08:27:46 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss6 Day 87 : రేవంత్ - సత్యల మధ్య "టికెట్ టు ఫినాలే" చిచ్చు..ఆదిరెడ్డి అంతా సెట్ చేసుకుని వచ్చాడా ?
తాను అవుటయ్యాక మిగతా వాళ్లకు ఇబ్బంది లేకుండా చూసిందని బ్లేమ్ చేశాడు. శ్రీసత్యను శాడిస్టు అనడంతో ఆమె ఒక్కసారిగా ఫైర్..
బిగ్ బాస్ సీజన్ 6లో 13వ వారం నుండి కెప్టెన్సీ టాస్కులు ఉండవు. గ్రాండ్ ఫినాలేకి ఇంకా 17 రోజులే ఉంది. ప్రస్తుతం హౌస్ లో 8 మంది సభ్యులున్నారు. ఈవారం ఇంటి సభ్యుల మధ్య టికెట్ టు ఫినాలే టాస్క్ నడుస్తోంది. మొదటి రెండు-మూడు వారాలు కామ్ గా ఉన్న శ్రీసత్య ఆ తర్వాత ప్రతిగేమ్ లోనూ గట్టి పోటీ ఇస్తూ వచ్చింది. అలాంటిది టికెట్ టు ఫినాలే లో అందరికన్నా ముందు తానే అవుట్ అవడం ఆమె అభిమానులకు ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత ఇనయ, కీర్తి, రోహిత్ లు కూడా గేమ్ నుండి అవుటయ్యారు. ఇక మిగిలిన రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, ఫైమాకి బిగ్ బాస్ మరో గేమ్ పెట్టారు.
ఒక చెక్క ఫ్రేమ్ కి పొడవైన చెక్క గరిట అమర్చబడి ఉంటుంది. ఆ గరిట మధ్య భాగం మాత్రమే ఆ ఫ్రేమ్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఒక చివరన పింగాణీ ప్లేట్స్ ఒకదానిపై ఒకటి సంచాలకులు చెప్పినవి పేర్చుతూ, అవి పడిపోకుండా మరో చివరన పట్టుకుని హ్యాండిల్ చేస్తుండాలి. ఎవరి ప్లేట్స్ కింద పడిపోతే వారు ఈ గేమ్ నుంచి పక్కకి తప్పుకోవలసి ఉంటుంది. ఈ గేమ్ కి శ్రీ సత్య - ఇనయా సంచాలకులుగా వ్యవహరించారు.
ఈ గేమ్ లో ప్లేట్స్ ను బ్యాలెన్స్ చేయలేక ముందుగా ఫైమా, ఆ తరువాత రేవంత్, శ్రీహాన్ బయటికి వచ్చారు. చివరి వరకూ ఆదిరెడ్డి మాత్రమే ఉన్నాడు. అయితే తాను గేమ్ లో ఉన్నప్పుడు సంచాలకురాలిగా శ్రీసత్య టైమ్ వేస్ట్ చేయడం వలన, అంతసేపు తాను బ్యాలెన్స్ చేయలేకపోయానని రేవంత్ ఆరోపించాడు. తాను అవుటయ్యాక మిగతా వాళ్లకు ఇబ్బంది లేకుండా చూసిందని బ్లేమ్ చేశాడు. శ్రీసత్యను శాడిస్టు అనడంతో ఆమె ఒక్కసారిగా ఫైర్ అయింది. గెలుపుని తీసుకున్నపుడు, ఓటమిని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావ్ రేవంత్. ఓటమిని తీసుకోలేక అలా మాట్లాడటం కరెక్టు కాదంటూ అసహనాన్ని వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఇద్దరి మధ్య పెద్ద రచ్చే జరిగింది.
కాగా.. బిగ్ బాస్ రివ్యూవర్ గా హౌస్ లోకి వచ్చిన ఆదిరెడ్డిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్దచర్చే జరుగుతుంది. గీతూ ఉన్నతవరకూ అమాయకుడిలా ఉన్న అతను ఇప్పుడు ఒరిజినాలిటీ చూపిస్తున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆదిరెడ్డి బిగ్ బాస్ పీఆర్ టీమ్ నుండి వచ్చాడని, అందుకే అతనికి ఓటింగ్ ఎక్కువగా వస్తుందని లీక్స్ చెబుతున్నాయి. ఈవారం రోహిత్ ని వాంటెడ్ గా ఎలిమినేట్ చేయాలని చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
Next Story