Mon Dec 23 2024 16:53:07 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బాస్ 6 డే 9 : బొమ్మల్నిచ్చి పిల్లల్లా పెంచమన్న బిగ్ బాస్.. గీతూకి చుక్కలు
బిగ్ బాస్ చెప్పినట్లు ఇంటి సభ్యులు తమకు కేటాయించిన బేబీ బొమ్మలను ఆడించడం మొదలుపెట్టారు. మధ్య మధ్యలో బొమ్మలు..
బిగ్ బాస్ 5 సీజన్ల కంటే.. 6వ సీజన్ చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతోంది. బిగ్ బాస్ ఇస్తున్న టాస్కుల్లో ఇంటిసభ్యులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ.. ఒకరికొకరు గట్టిపోటీనిస్తున్నారు. రెండోవారం నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఇక మంగళవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్.. హౌస్ మేట్స్ కి కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో భాగంగా 'సిసింద్రీ' టాస్క్ ఇచ్చారు. హౌస్ లో ఉన్న ప్రతి సభ్యుడికి ఒక బేబీ బొమ్మని ఇచ్చి.. బిగ్ బాస్ చెప్పేంతవరకూ ఆ బేబీ బొమ్మని సొంత బేబీలా చూసుకోవాలని చెప్పాడు. ఆకలి వేస్తే పాలు పట్టడం, డైపర్లు మార్చడం, తినిపించడం వంటి పనులు చేయాలి.
బిగ్ బాస్ చెప్పినట్లు ఇంటి సభ్యులు తమకు కేటాయించిన బేబీ బొమ్మలను ఆడించడం మొదలుపెట్టారు. మధ్య మధ్యలో బొమ్మలు ఏడ్చేలా, నవ్వేలా సెట్ చేశాడు బిగ్బాస్. ఈ టాస్క్ లో గీతూని బాగా ఆడుకున్నాడు బిగ్బాస్. ఎప్పటిలాగే గీతూ హడావిడి చేస్తూ నాకు పిల్లల్ని చూడటం రాదు. నేను పిల్లల్ని కొడతాను అనడంతో బిగ్బాస్ గీతూకి ఇచ్చిన బొమ్మని పదేపదే ఏడ్పించాడు. గీతూ అవస్థ చూడలేక హౌస్ లో అందరూ నవ్వేశారు. ఈ టాస్క్ లో బజర్ మోగినప్పుడు గార్డెన్ ఏరియాలో ఉన్న ఐదు బేబీ చైర్లో బేబీని పెట్టిన వారు నెక్ట్స్ కెప్టెన్సీ టాస్క్ కి ఎంపికవుతారు అని చెప్పాడు. బజర్ మోగగానే.. రేవంత్, చంటి, ఆరోహి, ఫైమా తమ బేబీలను బేబీ చైర్ లో పెడతారు.
నెక్ట్స్ అసలు టాస్క్ మొదలవుతుంది. గార్డెన్ ఏరియాలో ఐదు బోర్డులు పెట్టి.. ఆ బోర్డులపై రకరకాల ఆకారాలను చెక్కారు. వాటి ఆకారాలను బోర్డులకు కొద్దిదూరంలో ఉంచారు. మొదటి ఐదుగురు సభ్యులు గోనెసంచి కాళ్ల నుంచి పైకి వేసుకుని గెంతుతూ బోర్డులపై ఉన్న ఆకారాలను తీసుకొచ్చి ఫిక్స్ చేయాలి. ఈ టాస్క్ లో చంటి అందరికన్నా ముందు బోర్డుపై ఆకారాలను ఫిక్స్ చేసి.. మొదటి కెప్టెన్సీ పోటీదారునిగా ఎన్నికయ్యాడు. టాస్క్ పూర్తయ్యాక రేవంత్.. తన బేబీని బేబీ చైర్ లో నుంచి తీసుకోవడం మరిచిపోతాడు. దాంతో గీతూ ఆ బొమ్మని పక్కన పెడుతుంది. రేవంత్ తన బేబీ డాల్ ని కోల్పోతాడు. దాంతో రేవంత్ తన భార్య, పుట్టబోయే పాపను గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యాడు.
Next Story