Mon Dec 23 2024 09:22:20 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 Day 62 : ఆ నలుగురిపై ఫైరైన నాగార్జున.. ఫుడ్ వేస్ట్ చేస్తున్నారంటూ క్లాస్
గీతూకి సంబంధించిన కొన్ని వీడియోలను చూపించి.. ఇంటి సభ్యులు తప్పు చేస్తున్నా నువ్వు ఊరుకున్నావు ఇందుకు వచ్చేవారం ..
బిగ్ బాస్ సీజన్ 6లో ప్రతివారం ఎపిసోడ్ లో ఎవరొకరికి క్లాసులు తీసుకుంటూనే ఉన్నారు నాగార్జున. ఎంతో సరదాగా సాగాల్సిన వీకెండ్ ఎపిసోడ్.. చాలా సీరియస్ మోడ్ లో జరిగింది. గీతూ, శ్రీహాన్, ఇనయ, రేవంత్ లపై నాగార్జున సీరియస్ అయ్యారు. మొదట ఈ వారం జరిగిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో రెడ్, బ్లూ టీమ్ మెంబర్స్‌కు ర్యాంకులివ్వమని ఆ టీం హెడ్స్ గా చేసిన గీతూ, ఆదిరెడ్డిలకు చెప్పాడు నాగార్జున. బ్లూ టీమ్ లీడర్ ఆదిరెడ్డి.. రాజ్ కి ఫస్ట్, ఇనయాకి సెకండ్, మెరీనా, వాసంతి, బాలాదిత్య, రోహిత్‌లకు వరుసగా మూడు, నాలుగు, ఐదు, ఆరు ర్యాంక్స్ ఇచ్చాడు. తనకు మాత్రం ఏడో ర్యాంక్ ఇచ్చుకున్నాడు. ఇక గీతూ తన రెడ్ టీంలో శ్రీహాన్‌కు ఫస్ట్, ఫైమాకు సెకండ్, శ్రీసత్య, రేవంత్ లకు మూడు, నాలుగు ర్యాంక్స్ ఇచ్చింది. తనకి ఐదో ర్యాంక్ , కీర్తికి ఆరో ర్యాంక్ ఇచ్చింది.
సిగరెట్ విషయంలో బాలాదిత్య, గీతూ మధ్య జరిగిన గొడవ గురించి ప్రస్తావిస్తూ ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చాడు. ఆట ముగిసిన తర్వాత కూడా గీతూ చేసిన పని ఏమీ బాగోలేదన్నాడు. ఇక రేవంత్ గురించి తెలిసిందే. కోపంగా, ఫిజికల్ గా ఆడుతూ.. హౌస్ మేట్స్ ని హర్ట్ చేస్తున్నాడు. అందుకు సంబంధించిన వీడియోని చూపించి.. కోపం ఇంకా తగ్గించుకోవాలి.. లేదంటే డైరెక్ట్ గా ఎలిమినేట్ అవుతావంటూ వార్నింగ్ ఇచ్చాడు. కొత్త కెప్టెన్ శ్రీసత్యకి కంగ్రాట్స్ చెప్పి.. గతవారం కెప్టెన్ గా ఉన్న శ్రీహాన్ ను నువ్వేం పొడిచావో చెప్పు అనడంతో.. శ్రీహాన్ ఏం మాట్లాడలేకపోయాడు.
గీతూకి సంబంధించిన కొన్ని వీడియోలను చూపించి.. ఇంటి సభ్యులు తప్పు చేస్తున్నా నువ్వు ఊరుకున్నావు ఇందుకు వచ్చేవారం నువ్వు కెప్టెన్సీ పోటీకి అనర్హుడివి అని నాగార్జున ప్రకటించాడు. గీతూ వల్లే ఈ ఎపిసోడ్ లో చాలా మందికి కౌంటర్లు పడ్డాయి. గీతూ వల్లే ఆదిరెడ్డి కెప్టెన్సీ పోటీదారుడిగా అవకాశం పోగొట్టుకున్నాడు. ఇక ఈ వారం ఆదిరెడ్డి, గీతూలు వరస్ట్ పర్ఫామర్ ట్యాగ్స్ అందుకున్నారు. ఇంటిలో ఫుడ్ సరిపోవడం లేదంటూ.. ఇనయా చేసిన గోల అంతాఇంతా కాదు. అందుకు సమాధానంగా నాగార్జున ఫుడ్ వేస్ట్ చేస్తున్న వీడియోని చూపించాడు. ఫుడ్ సరిపోకపోవడం మీ తప్పే అని అందరికి వార్నింగ్ ఇచ్చాడు. ఈ విషయంలో ఇనయాకి సపరేట్ వార్నింగ్ ఇచ్చాడు.
రెండుసార్లు టీ తాగడం.. ఒకసారి పాలు తాగడం ఒకటే కాదని చెప్పాడు. కెప్టెన్సీ టాస్క్ సమయంలో శ్రీసత్య, శ్రీహన్ గురించి తప్పుగా మాట్లాడటంతో ఇనయాకి గట్టిగానే క్లాస్ పీకాడు నాగ్. ఇనయా కవర్ చేయాలనీ ట్రై చేసినా, ఎంత కవర్ చేసినా కెమెరాలు చూస్తున్నాయ్..దొరికిపోయావ్ అంటూ కౌంటర్ ఇచ్చాడు నాగార్జున. ఇక ఈవారం నామినేషన్స్ లో ఉన్నవారిలో ఆదిరెడ్డి, కీర్తి, రేవంత్ సేఫ్ అయ్యారు. నేటి ఎపిసోడ్ లో గీతూరాయల్ ఎలిమినేట్ అవుతుందని ముందే లీక్స్ వచ్చాయి. అది నిజమో కాదో చూడాలి.
Next Story