Mon Dec 23 2024 03:19:41 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బాస్ 6 లో ఏం జరుగుతోంది ? ఆ విషయంలో హర్టైన నాగార్జున.. తర్వాతి సీజన్ నుండి హోస్ట్ చేయరా ?
ఫస్ట్ వీక్ నుండి ఇనయ టాప్ ఓటింగ్ లోనే ఉంది. ఈ వీక్ కూడా ఆమె టాప్ ఓటింగ్ లిస్ట్ లో ఉండగా.. ఆదిరెడ్డి బాటమ్ లో ఉన్నాడు. కానీ..
బిగ్ బాస్ సీజన్ 6.. మూడోవారం నుండి ఊహించని ఎలిమినేషన్లు జరుగుతూ వచ్చాయి. ఉంటారనుకున్నవారు వెళ్లిపోతుంటే.. వెళ్లిపోతారనుకున్నవారు ఉండిపోయారు. ఒక కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన ఆదిరెడ్డి.. 14 వారాలు హౌస్ లో ఉండటంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సూర్య, గీతూల ఎలిమినేషన్లు ఎవరూ ఊహించలేదు. 14వ వారం ఇనయ ఎలిమినేట్ అవనుంది. ఈ ఎలిమినేషన్ చాలా అన్ ఫెయిర్ గా ఉందని ఇప్పటికే నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ఫస్ట్ వీక్ నుండి ఇనయ టాప్ ఓటింగ్ లోనే ఉంది. ఈ వీక్ కూడా ఆమె టాప్ ఓటింగ్ లిస్ట్ లో ఉండగా.. ఆదిరెడ్డి బాటమ్ లో ఉన్నాడు. కానీ..కొందరు తమ పరపతిని ఉపయోగించి ఆదిరెడ్డిని ఎలిమినేట్ కాకుండా చేశారని గట్టిగా టాక్ వినిపిస్తోంది. ఇనయ ఎలిమినేషన్ విషయంలో నాగార్జున కూడా బాగా హర్ట్ అయ్యారని తెలుస్తోంది. టాలెంట్ ఉన్న వాళ్లని, ఓటింగ్ ఎక్కువ వచ్చిన వాళ్లని ఎలిమినేట్ చేయడంతో నాగ్ సీరియస్ అయ్యారట. ఇక సీజన్ 6తో నాగార్జున బిగ్ బాస్ కు గుడ్ బై చెప్పేస్తున్నారని, తర్వాతి సీజన్లను ఆయన హోస్ట్ చేయని సోషల్ మీడియాలో పోస్టులు వెలువడ్డాయి.
ఆదిరెడ్డి.. ఆది నుండి ఎందులోనూ లేడు. గేమ్ లలో ఆడిన రోహిత్ ని పక్కనపెట్టి, హౌస్ లో కూడా రివ్యూస్ ఇచ్చే ఆదిరెడ్డినే ఎక్కువగా చూపించారు. కేవలం రివ్యూలు, కుళ్లు పంచ్ లు, కుప్పిగంతులు వేసే ఆదిరెడ్డిని బిగ్ బాస్ పీఆర్ టీమ్ విన్నర్ చేయాలని చూస్తోందని తెలుస్తోంది. తానే విన్నర్ అవుతానని.. రేవంత్, శ్రీహాన్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఆదిరెడ్డి మాత్రం ఓవర కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మరి సోషల్ మీడయాలో వచ్చేవి ఎంతవరకూ నిజమో గ్రాండ్ ఫినాలే వరకూ ఆగాల్సిందే.
Next Story