Mon Dec 23 2024 18:40:27 GMT+0000 (Coordinated Universal Time)
Bigg Boss 6 : వాళ్లపై రివేంజ్ తీర్చుకుంటా : తన ఎలిమినేషన్ పై నేహా షాకింగ్ కామెంట్స్
గేమ్ సీరియస్గా ఆడుతున్న నేహా ఎలిమినేట్ కావడంపై నెటిజన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తన ఎలిమినేషన్ పై నేహా..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 మొదలై మూడువారాలు పూర్తైంది. తొలివారం ఎలిమినేషన్ లేదు. రెండోవారం అభినయ శ్రీ, షాని ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. మూడోవారం ఎలిమినేషన్ ప్రక్రియలో అనూహ్యంగా నేహా చౌదరి ఇంటి నుంచి బయటికొచ్చింది. కానీ.. ఈవారం ఎలిమినేట్ అవ్వాల్సింది ఆమె కాదన్న వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి. తొలుత ఈ వారం వాసంతి హౌస్ నుంచి బయటికొస్తుందనుకున్నారు. ఆ తర్వాత ఇనయా పేరు వినిపించింది. ఆఖరికి స్ట్రాంగ్ గా ఆడుతోన్న నేహా ను ఎలిమినేట్ చేయడంపై అనుమానాలు వస్తున్నాయి.
గేమ్ సీరియస్గా ఆడుతున్న నేహా ఎలిమినేట్ కావడంపై నెటిజన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తన ఎలిమినేషన్ పై నేహా కూడా షాకయ్యింది. నమ్మినవాళ్లే ఇలా చేశారని.. ముఖ్యంగా రేవంత్ వల్లే తాను బయటకు వచ్చానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా నేహా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఎలిమినేషన్ పై అసహనం వ్యక్తం చేసింది. తాను హౌస్ నుంచి ఎందుకు ఎలిమినేట్ అయ్యానో అర్థం కావడం లేదని, తనకంటే గేమ్ ఆడనివాళ్లు చాలామంది ఇంట్లోఉన్నారని తెలిపింది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేందుకు తను మరో ఛాన్స్ వస్తే.. తప్పకుండా వెళ్తానని, రివేంజ్ తీర్చుకోవాల్సిన వాళ్లు చాలామంది ఉన్నారని తెలిపింది. ఏదేమైనా బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు తనకు మెమొరబుల్ గా ఉంటాయని వ్యాఖ్యానించింది.
Next Story