Mon Dec 23 2024 17:11:08 GMT+0000 (Coordinated Universal Time)
Bigg Boss 6: డైరెక్ట్ ఎలిమినేషన్ తో అందరికీ షాక్.. హద్దులు మీరిన ఇనయ
హౌస్ లో అనర్హులు ఎవరని భావిస్తున్నారో వారికి 'రాటెన్ ఫిష్' బ్యాడ్జ్ పెట్టాలని శ్రీహాన్ కి చెప్పారు నాగార్జున.
బిగ్ బాస్ సీజన్ 6లో 8వ వారం ఎలిమినేషన్ ఎవరూ ఊహించని విధంగా జరిగింది. ఈ వారం హౌస్ లోని కంటెస్టంట్లంతా నామినేషన్స్ లో ఉన్న విషయం తెలిసిందే. శనివారం టెలీకాస్ట్ అయిన ఎపిసోడ్ లో.. నాగార్జున హౌస్ మేట్స్ ఆటతీరుని అభినందించారు. కానీ.. గీతూ తన గేమ్ ఆడకుండా.. పక్కనవాళ్లని వెనక్కి లాగేందుకే ఎక్కువగా కష్టపడిందంటూ.. నాగార్జున క్లాస్ ఇచ్చారు. నీ ఆట బొచ్చులో ఆటలాగా ఉంది అనేశారు. దాంతో గీతూ చాలా అప్సెట్ అయింది. ఎపిసోడ్ మొత్తం తల దించుకునే ఉంది.
ఇక జంటగా ఆడిన కంటెస్టంట్లు.. తమ పార్ట్ నర్ కు ఎన్నిమార్కులు ఇస్తారో చెప్పాలని అడిగారు నాగార్జున. ఆటతీరు సరిగా లేని కారణంగా గీతూకి పనిష్మెంట్ ఇవ్వాలని కెప్టెన్ శ్రీహాన్ కి చెప్పడంతో.. గిన్నెలు క్లీన్ చేయిస్తానని అన్నాడు. కానీ.. ఆ పని చేయలేనన్న గీతూ.. ఈ వారమంతా బాత్రూమ్స్ క్లీన్ చేస్తానని ఒప్పుకుంది. ఇక అందరికంటే.. రేవంత్ - ఇనయల గేమ్ చాలా బాగుందన్నారు నాగ్. కానీ.. రేవంత్ ఒక ఉన్మాదిలా ఆడాడడన్నారు. ఒక వీడియోలో రేవంత్.. గీతూ, కీర్తిలను తోసేస్తుండటాన్ని చూపించారు. మరోసారి ఇలా చేయవద్దని.. కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఆడాలని సూచించారు.
హౌస్ లో అనర్హులు ఎవరని భావిస్తున్నారో వారికి 'రాటెన్ ఫిష్' బ్యాడ్జ్ పెట్టాలని శ్రీహాన్ కి చెప్పారు నాగార్జున. పాజిటివ్స్ చెప్పినప్పుడు ఎలా తీసుకుంటామో.. నెగెటివ్స్ కూడా అలానే తీసుకోవాలి. కానీ కీర్తి మాత్రం నెగెటివ్ పాయింట్ ను మైండ్ లో పెట్టేసుకుంటుందని రీజన్ చెప్పి ఆమెకి బ్యాడ్జ్ ఇచ్చాడు శ్రీహాన్. నామినేషన్స్ లో ఉన్నవారిలో సేవింగ్ లేకుండా.. డైరెక్ట్ ఎలిమినేషన్ తో షాిచ్చారు నాగర్జున.
ఈవారం సూర్య హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతున్నట్లు చెప్పేశారు. దాంతో ఇనయ, ఫైమా, రాజ్, కీర్తి లు బాగా ఏడ్చేశారు. ఇనయ మరోసారి హద్దులు మీరి.. ఎలిమినేట్ అయి వెళ్లిపోతున్న సూర్యపై ముద్దుల వర్షం కురిపించింది. ఇది చూడలేకే బిగ్ బాస్ ఈ వారం అనూహ్యంగా సూర్యని ఎలిమినేట్ చేశారని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అందరూ అనుకున్నారు.. కానీ అలాంటిదేమీ లేదని సమాచారం.
Next Story