Mon Dec 23 2024 02:33:07 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 : ప్రైజ్ మనీతో పాటు..రెమ్యునరేషన్ కలిపి మొత్తం శ్రీహాన్ కు వచ్చింది ఎంతో తెలుసా ?
బిగ్ బాస్ హౌస్ లో ఉండే వారికి నిజంగా అంత మొత్తంలో రెమ్యునరేషన్ ఇస్తారా ? అన్నది నెటిజన్ల ప్రశ్న. ఆ ప్రశ్న ప్రశ్నగానే ..
బిగ్ బాస్ సీజన్ 6 ముగిశాక.. విన్నర్ అండ్ రన్నర్లుగా నిలిచిన వారితో పాటు.. టాప్ 5 లో ఉన్న కంటెస్టంట్లు తమ పర్సనల్ లైఫ్ లో చాలా బిజీ అయిపోయారు. రేవంత్, శ్రీహాన్, కీర్తి ఆదిరెడ్డి, రోహిత్ లు పలు ఇంటర్వ్యూలు, వివిధ కార్యక్రమాలకు గెస్టులుగా వెళ్తూ బిజీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సీజన్ ముగిశాక టాప్ 5లో ఉన్న కంటెస్టంట్లలో ఒక్కొక్కరికి 15 వారాలకు గాను ఎంత రెమ్యునరేషన్ వచ్చిందీ లీకవుతోంది. 5వ స్థానంలో ఉన్న రోహిత్ కు 15 వారాలకు గాను రూ.37.5 లక్షలు రెమ్యునరేషన్ వచ్చినట్లు సమాచారం. అలాగే 4వ స్థానంలో ఉన్న ఆదిరెడ్డికి రూ.30 లక్షలు, 3వ స్థానంలో ఉన్న కీర్తికి రూ.37.5 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చారని తెలుస్తోంది.
తాజాగా.. రన్నర్ గా నిలిచిన శ్రీహాన్ కు ఎంత రెమ్యునరేషన్ వచ్చిందో తెలిసింది. విన్నింగ్ ప్రైజ్ మనీ నుండి నాగార్జున ఆఫర్ చేసిన రూ.40 లక్షలు, లెన్స్ కార్ట్ స్టైలిష్ కంటెస్టంట్ ప్రైజ్ మనీ రూ.5 లక్షలు కాకుండా.. 15 వారాలపాటు హౌస్ లో ఉన్నందుకు గాను బిగ్ బాస్ మేనేజ్ మెంట్ శ్రీహాన్ కు రూ.37.5 లక్షలు చెల్లించిందని సమాచారం. ఈ మొత్తం కలిపితే బిగ్ బాస్ వల్ల శ్రీహాన్ పొందిన లాభం రూ.82.5 లక్షలు అవుతుంది. కానీ.. బిగ్ బాస్ హౌస్ లో ఉండే వారికి నిజంతా అంత మొత్తంలో రెమ్యునరేషన్ ఇస్తారా ? అన్నది నెటిజన్ల ప్రశ్న. ఆ ప్రశ్న ప్రశ్నగానే ఉంటుంది తప్ప.. అటు కంటెస్టంట్లు గానీ.. ఇటు బిగ్ బాస్ మేనేజ్ మెంట్ గానీ ఆ ప్రశ్నలపై ఇప్పటి వరకూ స్పందించలేదు. ఎలిమినేషన్ లీకులు నిజమైనట్లే.. రెమ్యునరేషన్ కూడా నిజమే అయి ఉంటుందన్నది మరికొందరి అభిప్రాయం. ఇక రేవంత్ కు ఎంత రెమ్యునరేషన్ చెల్లించారో తెలియాల్సి ఉంది. ఎంత చెల్లించినా.. ఈ సీజన్లో అత్యధిక క్యాష్ పొందింది మాత్రం శ్రీహానే అంటున్నారు.
Next Story