బిగ్ బాస్ 6 : సెకండ్ వీక్ నామినేషన్స్.. హౌస్ లో అర్థరాత్రి దొంగతనాలు
సెకండ్ వీక్ నామినేషన్స్ ప్రక్రియను ప్రారంభించాడు బిగ్ బాస్. అయితే ఈసారి ఒక్కొక్కరు ఒకరినే నామినేట్ చేయాలని కండిషన్..
బిగ్ బాస్ సీజన్ 6 తొలివారం పూర్తిచేసుకుని.. రెండోవారంలోకి అడుగుపెట్టింది. సోమవారం ఎపిసోడ్ లో శ్రీసత్య, శ్రీహన్, రేవంత్, అర్జున్ కళ్యాణ్ మధ్య హౌస్ గురించి చర్చలు జరిగాయి. ఇందులో భాగంగా శ్రీసత్య మాట్లాడుతూ.. ఫ్రెండ్లీగా నా భుజం మీద టచ్ చేస్తే ఓకే, సైడ్ హగ్ ఇచ్చినా ఓకే. అంతకుమించి నన్ను నన్ను టచ్ చేయాలని చూస్తే నేను ఊరుకోను అని చెప్పింది. ఇంతలో ఇనయా మైక్ మిస్ అవ్వగా.. హౌస్ అంతా వెతికింది. కానీ ఎక్కడా కనిపించలేదు. చివరకు ఆర్జే సూర్య వద్ద మైక్ కనిపించింది. దాంతో ఇనయా.. తన మైక్ ను కావాలనే దాచిపెట్టారని కెప్టెన్ బాలాదిత్యకు కంప్లైంట్ చేసింది. రాత్రి సమయంలో సూర్య, ఫైమా, ఆరోహి కలిసి అల్లరి పనులు చేస్తున్నారు. అందరూ నిద్రపోయిన తర్వాత వంటగదిలో ఉన్న ఫుడ్ ని దొంగతనంగా తిన్నారు. ఇక చలాకి చంటి అందరి మీద సెటైర్స్ వేస్తూ నవ్వించాడు. అనంతరం బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియను ప్రారంభించాలని చెప్పాడు.