Mon Dec 23 2024 15:52:48 GMT+0000 (Coordinated Universal Time)
Bigg Boss 6 Day 14 : హౌస్ లో లవ్ ట్రాక్ లు.. ఆటపట్టించిన తమన్నా-నాగార్జున
ఏమిటీ రెస్పాన్స్ అని నాగార్జున అడగ్గా.. సంథింగ్ సంథింగ్ ఏదో ఉందంటారు. అలా వారిద్దరినీ కాసేపు ..
బిగ్ బాస్ సీజన్ 6 14వ రోజు టెలీకాస్ట్ అయిన ఎపిసోడ్ లో "బబ్లీ బౌన్సర్" మూవీ ప్రమోషన్ లో భాగంగా తమన్నా బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చింది. ఆమెతో సినిమా గురించి మాట్లాడిన అనంతరం.. నాగార్జున ఒక కానుక ఇచ్చి తమన్నాను హౌస్ లోపలికి పంపుతాడు. అమ్మాయిలంతా ఒకవైపు, అబ్బాయిలంతా ఒకవైపు కూర్చోమని చెప్తాడు నాగార్జున. అనంతరం అబ్బాయిలకు ఒక టాస్క్ ఇస్తాడు. అమ్మాయిల్లో ఎవరు తమకు లేడీ బౌన్సర్ గా కావాలి ? ఎందుకు కావాలి ? రీజన్ చెప్పమంటాడు. ముందు అర్జున్ తో టాస్క్ మొదలవుతుంది.
గీతూ లేదా శ్రీసత్య లలో ఒకరు తనకు కావాలనగానే ఆడియన్స్ అరుస్తారు. ఏమిటీ రెస్పాన్స్ అని నాగార్జున అడగ్గా.. అర్జున్ - శ్రీసత్యల మధ్య సంథింగ్ సంథింగ్ ఏదో ఉందంటారు. అలా వారిద్దరినీ కాసేపు ఆటపట్టించారు. ఎక్కువమంది లేడీ బౌన్సర్ గా గీతూని ఎంచుకున్నారు. తర్వాత తమన్నా అబ్బాయిల్లో నుంచి రోహిత్, రేవంత్, అర్జున్, సూర్యని తన బౌన్సర్లు గా ఎంచుకుంది. ఈ నలుగురు తమ ట్యాలెంట్స్ తో తమన్నాని ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నించారు. రేవంత్ పాట పాడగా.. సూర్య ప్రభాస్, అల్లు అర్జున్ ల వాయిలతో తమన్నాను ఇంప్రస్ చేస్తాడు. దాంతో తమన్నాతో తెచ్చిన కానుకను సూర్యకి ఇవ్వమని ఆరోహిని పిలుస్తాడు నాగ్.
దానిని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని చెప్పగా.. ఇద్దర్లో ఎవరిదగ్గరున్నా ఒకటే కదా సార్ అంటుంది ఆరోహి. ఇక్కడ మళ్లీ వారిద్దరినీ ఆటపట్టిస్తారు. ఇక తమన్నా బయటకి వచ్చేసిన తర్వాత నాగార్జున ఎలిమినేషన్ ప్రక్రియ మొదలుపెట్టాడు. కంటెస్టెంట్స్ తో గజిబిజి గానా అనే గేమ్ ఆడిస్తూ మధ్యలో నామినేషన్స్ లో ఉన్న వారిని ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చారు. ఆఖర్లో ఆదిరెడ్డి - అభినయశ్రీ ఉండగా.. స్టేజి మీద ఉన్న నాగార్జున ఒక చిన్న టాస్క్ తో అభినయ ఎలిమినేట్ అయిందని ప్రకటించాడు. దీంతో అభినయ హౌస్ లోంచి బయటకి వచ్చింది.
ఆ తర్వాత అభినయ వేదికపైకి రాగా నాగార్జున హౌస్ లో ఆమె జర్నీ చూపించారు. అభినయ మాట్లాడుతూ.. హౌస్ లో ఫైమా, చంటి, బాలాదిత్య, శ్రీసత్య, సూర్య లని హానెస్ట్ అని, రేవంత్ మాత్రం కన్నింగ్ అని, మిగిలిన వారంతా వారి స్ట్రాటజిలతో గేమ్ బాగా ఆడుతున్నారు అని చెప్తుంది. అభినయకు అందరూ వీడ్కోలు పలకడంతో ఎపిసోడ్ పూర్తవుతుంది. నేటి ఎపిసోడ్ లో మళ్లీ నామినేషన్ల ప్రక్రియలతో హౌస్ మేట్స్ మధ్య గొడవలు మొదలవుతాయనడంలో సందేహం లేదు.
Next Story