Mon Dec 23 2024 04:04:16 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 Grand Finale : ఆ ఐదుగురికి అవార్డులిచ్చిన టాప్ 5 కంటెస్టంట్స్.. రోహిత్ ను ఎలిమినేట్ చేసిన నిఖిల్
ఇక ఆ తర్వాత కంటెస్టంట్స్ ఒక్కొక్కరితో నాగార్జున మాట్లాడారు. ప్రతిఒక్కరూ తమ జీవితం చాలా బాగుందని చెప్పగా..
బిగ్ బాస్ సీజన్ 6 ఆఖరి ఎపిసోడ్ వచ్చేసింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఎపిసోడ్ ప్రారంభమయింది. 22 మంది కంటెస్టంట్స్ తో ప్రారంభమైన ఈ సీజన్ ఇక ఈరోజులో పూర్తికానుంది. తొలివారం నుండి ఎలిమినేట్ అవుతూ వచ్చిన కంటెస్టంట్స్ అంతా గ్రాండ్ ఫినాలేకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. కొత్తపెళ్లికూతురు నేహా కూడా ఈ ఈవెంట్ కు రావడం విశేషం. ఈరోజు రాత్రి 10 గంటలకే తన పెళ్లి అని బిగ్ బాస్ వేదికగా చెప్పింది స్పోర్ట్స్ స్టార్. టాప్ 5 కంటెస్టంట్స్ ఫ్యామిలీస్ కూడా వచ్చాయి.
ఇక ఆ తర్వాత కంటెస్టంట్స్ ఒక్కొక్కరితో నాగార్జున మాట్లాడారు. ప్రతిఒక్కరూ తమ జీవితం చాలా బాగుందని చెప్పగా.. గీతూ మాత్రం ఇంకా తన ఎలిమినేషన్ ను జీర్ణించుకోలేకపోతున్నానంది. అనంతరం 105 రోజుల బిగ్ బాస్ జర్నీని చూపించారు బిగ్ బాస్. ఈ జర్నీ చూసి ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అయ్యారు. అందరితో మాట్లాడిన అనంతరం.. టాప్ 5 కంటెస్టంట్స్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అనంతరం హౌస్ లోకి 5 కిరీటాలను పంపి.. ఒక్కొక్కరు తమకిచ్చిన కిరీటాన్ని తమ ఫేవరెట్ ప్లేస్ లో పెట్టాలని చెప్పారు. కీర్తి, రోహిత్ లు వీఐపీ బాల్కనీలో, శ్రీహాన్ కిచెన్ లో, రేవంత్ గార్డెన్ లో, ఆదిరెడ్డి.. తను బాగా ఎమోషనల్ గా ఫీలైన ప్లేస్ లో కిరీటాలను పెట్టారు.
నెక్ట్స్.. స్టేజిపైకి ఐదు ట్రోఫీలను తెప్పించారు నాగార్జున. ఆ ఐదింటిని బయట ఉన్న 16 మందిలో తాను చెప్పిన దానికి టాప్ 5 కంటెస్టంట్లు ఇవ్వాలని చెప్పారు. ముందుగా రేవంత్.. బెస్ట్ కుక్ అవార్డును మెరీనా కి ఇచ్చాడు. ఆ తర్వాత కీర్తి బెస్ట్ స్లీపర్ అవార్డు శ్రీసత్య కి, ఆదిరెడ్డి బెస్ట్ డాన్సర్ అవార్డును ఫైమాకి, శ్రీహాన్ .. మోస్ట్ లవర్ బాయ్ గా అర్జున్ కి, రోహిత్ హ్యాండ్సమ్ బాయ్ అవార్డును రాజ్ కి ఇచ్చారు. తొలి గెస్ట్ గా వచ్చిన నిఖిల్.. హౌస్ లోకి రెడ్ హ్యాట్ తో వెళ్లి.. రోహిత్ ను బయటికి తీసుకొచ్చారు.
ఇక ఈ సీజన్ కు రవితేజ, నిఖిల్, రాధ, సన్నీలు గెస్టులుగా వచ్చారు. విన్నర్ కు 50 లక్షల నగదు, మారుతీ బ్రెజా, 605 గజాల స్థలంతో పాటు బిగ్ బాస్ ట్రోపీని అందజేయనున్నారు.
Next Story