Mon Dec 23 2024 08:45:24 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 Day 85 : నామినేషన్ ఆరోపణలతో హీటెక్కిన హౌస్..ఆ ఇద్దరూ మినహా అందరూ ..
ఈ వారం ఆదిరెడ్డి.. రేవంత్, రోహిత్ లని నామినేట్ చేశాడు. నామినేషన్ లో ఆదిరెడ్డి చెప్పిన పాయింట్లు చిరాకు తెప్పిస్తాయి.
21 మంది హౌస్ మేట్స్ తో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 6.. మరో మూడు వారాల్లో ముగియనుంది. ఆదివారం రాజ్ ఎలిమినేషన్ తర్వాత సోమవారం నాడు ఎప్పటిలాగే నామినేషన్స్ జరిగాయి. సీజన్ చివరికి వస్తుండటంతో ఈ వారం నామినేషన్స్ మరింత ఘాటుగా జరిగాయి. నామినేషన్ల సందర్భంగా ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలతో హౌస్ హీటెక్కింది. మొదటివారం నుండి నామినేషన్లో ఉన్న ఇనయ.. ఈవారం కెప్టెన్ కావడంతో.. నామినేషన్ నుండి ఊరట పొందింది. ముఖంపై రంగు చల్లే మిషన్ ఒకటి పెట్టి ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వారిపై ఆ మిషన్ తో రంగు చల్లమన్నాడు బిగ్బాస్.
ఈ వారం ఆదిరెడ్డి.. రేవంత్, రోహిత్ లని నామినేట్ చేశాడు. నామినేషన్ లో ఆదిరెడ్డి చెప్పిన పాయింట్లు చిరాకు తెప్పిస్తాయి. ఫైమా.. రేవంత్, రోహిత్ లని, శ్రీహాన్.. రోహిత్, ఆదిరెడ్డి లని, కీర్తి.. రేవంత్, శ్రీసత్యలని, శ్రీసత్య.. కీర్తి, ఆదిరెడ్డిలని, రోహిత్.. ఆది రెడ్డి, ఫైమాలని, రేవంత్.. ఆది రెడ్డి, ఫైమాలని, ఇనయా.. రేవంత్, శ్రీసత్యలని నామినేట్ చేశారు. మొత్తంగా ఈ వారం ఫైమా, రేవంత్, ఆదిరెడ్డి, శ్రీసత్య, రోహిత్, కీర్తి నామినేషన్స్ లో ఉన్నారు. శ్రీహాన్, ఇనయా ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు.
సాధారణంగా ఇనయ-శ్రీహాన్ లకు ఒక్క నిమిషం కూడా పడదు. అలాంటి ఈవారం ఇనయ కెప్టెన్ కావడంతో శ్రీహాన్ కు ఒక్క నామినేషన్ కూడా పడలేదు. ఇనయ కెప్టెన్ కాకపోయి ఉంటే.. ఖచ్చితంగా శ్రీహాన్ ని నామినేట్ చేసేది. మిగతా హౌస్ మేట్స్ శ్రీహాన్ పై పెద్దగా కాన్సన్ ట్రేట్ చేయలేదు.
Next Story