Tue Dec 24 2024 13:02:21 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 Day 22: నామినేషన్లతో హీటెక్కిన హౌస్..ఈవారం ఏకంగా 10 మంది
కెప్టెన్ గా ఉన్న ఆదిరెడ్డి ఈ వారం నామినేషన్లలో లేరు. కీర్తి, అర్జున్ కల్యాణ్ ను ఆదివారం ఎపిసోడ్ లో నాగార్జునే నామినేట్..
బిగ్ బాస్ సీజన్ 6 మూడోవారం పూర్తిచేసుకుని నాల్గవవారంలోకి అడుగుపెట్టింది. కానీ.. ఇంతవరకూ బిగ్ బాస్ కు చాలా దారుణమైన రేటింగ్ లు వచ్చాయి. వీకెండ్ ఎపిసోడ్ లు కూడా టీఆర్పీ 4 పాయింట్లు దాటకపోవడం గమనార్హం. మూడోవారం హౌస్ నుంచి నేహా చౌదరి ఎలిమినేట్ అయింది. ఇక సోమవారం వచ్చిన ఎపిసోడ్ లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. కానీ ఈసారి నామినేషన్ల ప్రక్రియ హీట్ గా సాగింది. ఫస్ట్ వీక్ లో జరిగిన గొడవలు మనసులో పెట్టుకుని కొందరు నామినేట్ చేస్తే.. అడవిలో ఆట విషయంలో ఇంకొందరు నామినేట్ చేశారు. చాలా సిల్లీ రీజన్స్ తో నామినేషన్లు సాగాయి.
కెప్టెన్ గా ఉన్న ఆదిరెడ్డి ఈ వారం నామినేషన్లలో లేరు. కీర్తి, అర్జున్ కల్యాణ్ ను ఆదివారం ఎపిసోడ్ లో నాగార్జునే నామినేట్ చేయడంతో వారిద్దరినీ ఇంకెవరూ నామినేట్ చేయకూడదని బిగ్ బాస్ తెలిపారు. ఈవారం కూడా ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. శ్రీహాన్..రాజశేఖర్, ఇనయాలను నామినేట్ చేశాడు. ముందు నుంచి ఇనయా, శ్రీహాన్ కి పడట్లేదు. దీంతో మరోసారి వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. సుదీప.. ఇనయ, రేవంత్ లను, గీతూ.. చంటి, ఇనయలను, వసంతి.. రేవంత్, సూర్యలను నామినేట్ చేశారు. ఆరోహి.. ఇనయ, రేవంత్ లను, బాలాదిత్య.. సూర్య, రేవంత్ లను,
ఇనయా.. సుదీప, శ్రీహాన్ లను నామినేట్ చేశారు. మళ్లీ ఇనయా- శ్రీహాన్ ల మధ్య గొడవ జరిగింది. చంటి.. గీతూ, ఇనయాలను, అర్జున్.. రాజ్, గీతూలను, సూర్య.. వసంతి, ఇనయలను నామినేట్ చేయగా..రేవంత్.. శ్రీసత్య, ఆరోహిలను నామినేట్ చేశాడు. రాజ్.. శ్రీహాన్, ఆరోహిలను, రోహిత్-మెరీనా.. సూర్య, ఇనయలను, కీర్తి.. ఇనయ, రేవంత్ లని నామినేట్ చేశారు. ఇక్కడ కీర్తి-ఇనయకు, కీర్తి-రేవంత్ కి మధ్య గొడవ జరిగింది. ఈవారం కూడా ఇనయ, రేవంత్ లకే నామినేషన్లు ఎక్కువ వచ్చాయి. ఈవారం నామినేషన్లలో అర్జున్, కీర్తి, ఇనయ, రేవంత్, సుదీప, శ్రీహాన్, గీతూ, సూర్య, రాజ్, ఆరోహి లు ఉన్నారు. వీరిలో ఎవరూ ఆట బాగా ఆడి హౌస్ లో ఉంటారు? ఎవరు ఎలిమినేట్ అవుతారు ? ఎవరు కెప్టెన్ అయి నామినేషన్ల నుంచి సేఫ్ అవుతారో చూడాలి.
Next Story