Mon Dec 23 2024 13:21:11 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 Day 82 : రేవంత్ కి డబుల్ ట్రీట్..ఆమె సలహాతో మారిన లుక్.. మొత్తానికి ఇనయ కోరిక తీరింది
ఇంతలోనే రేవంత్ తల్లిని హౌస్ లోకి పంపించి సర్ప్రైజ్ చేశాడు బిగ్ బాస్. తల్లిని చూసి ఎమోషనల్ అయిన రేవంత్ ఆమెని ..
బిగ్ బాస్ సీజన్ 6లో ఈ వారమంతా ఫ్యామిలీ మీట్స్ తో సరదాగా, ఎమోషన్ గా సాగిపోయింది. కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకొచ్చి ఎమోషనల్ ఎపిసోడ్ నడిపారు. శుక్రవారం ఎపిసోడ్ లో మిగిలిన రేవంత్ ఫ్యామిలీ ని తీసుకొచ్చారు. మొదట రేవంత్ కి తన భార్య అన్వితతో వీడియో కాల్ మాట్లాడే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. అన్వితతో మాట్లాడుతూ ఏడ్చేశాడు రేవంత్. తనకు డెలివరీ డేట్ ఇచ్చారని అన్విత చెప్పడంతో వీడియో కాల్ కట్ అయిపోయింది. ఇంకొంచెం సేపు మాట్లాడుతాను బిగ్ బాస్ ప్లీజ్ అంటూ ఏడ్చేశాడు రేవంత్.
ఇంతలోనే రేవంత్ తల్లిని హౌస్ లోకి పంపించి సర్ప్రైజ్ చేశాడు బిగ్ బాస్. తల్లిని చూసి ఎమోషనల్ అయిన రేవంత్ ఆమెని హగ్ చేసుకొని ఏడ్చేశాడు. రేవంత్ తల్లి మాట్లాడుతూ.. ఎందుకు ఊరికే ఏడుస్తున్నావు, కోపం ఎందుకు వస్తుంది, అందరికి తిండి పెట్టడానికి నీకేమైంది ? తిండి దగ్గర రూల్స్ పెడతావేంటి అంటూ తిట్టింది. అలాగే గడ్డం ఎందుకు అంత పెంచుకున్నావు, అన్విత కొంచెం తీసేయమందని చెప్పడంతో.. గడ్డం తీసేశాడు రేవంత్. రేవంత్ తో కలిసి స్టెప్పులేసి హౌస్ నుంచి వెళ్ళిపోయారామె.
నెక్ట్స్ కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. చివరి కెప్టెన్ గా ఈ సారి ఇనయా గెలిచి తన కోరిక తీర్చుకుంది. దీంతో ఇనయా చాలా సంతోషపడింది. నేను కెప్టెన్ గా అస్సలు రూల్స్ పెట్టను అని, ముఖ్యంగా తిండి దగ్గర అస్సలు రూల్స్ పెట్టను అని, హౌస్ లో మీకిష్టమొచ్చినట్టు ఉండండి అంటూ అందరికి చెప్పి రేవంత్ కి ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చింది. ఈ వీకెండ్ లో నాగ్ తో ఎవరికీ క్లాసులు పడకపోవచ్చు. కాగా.. ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాజ్ , రోహిత్ లు డేంజర్ జోన్లో ఉన్నారని, రోహిత్ ను కావాలనే ఎలిమినేట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఎంత వరకూ నిజమో తెలియాలంటే వీకెండ్ వరకూ ఆగాల్సిందే.
Next Story