Mon Dec 23 2024 17:55:12 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss6 Day 19 : కెప్టెన్ గా ఆదిరెడ్డి.. జైల్లోకి అర్జున్..వెక్కివెక్కి ఏడ్చిన కీర్తి
రేవంత్ 7నిమిషాల ట్యాగ్ గెలుచుకోగా.. మిగిలిన వారు ఒక్కొక్క ట్యాగ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆఖరిలో జీరో టైమింగ్ కోసం కీర్తి..
బిగ్ బాస్ సీజన్ 6లో 19వ రోజు ఎపిసోడ్ ఎప్పటిలాగే అరుపులు, ఏడుపులతో సాగింది. నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ లో కొత్త కెప్టెన్ ఎన్నికయ్యాడు. కెప్టెన్సీ టాస్క్ లో చివరివరకు శ్రీ సత్య, శ్రీహాన్, ఆదిరెడ్డి పోటీపడ్డారు. 'ఎత్తర జెండా' అనే టాస్క్ లో ముందుగా ఆదిరెడ్డి గెలవడంతో.. ఎలాంటి డౌట్ లేకుండా కెప్టెన్ గా ఎన్నికయ్యాడు. కెప్టెన్సీ ఎన్నిక అనంతరం హౌస్ లో గంటసేపు ప్రసారమయ్యే షోలో ఎవరు ఎక్కువగా కనిపిస్తారని అనుకుంటున్నారని ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్. దీంట్లో ఎక్కువగా పదినిమిషాల పాటు తాను కనిపిస్తానని చెప్పి గీతూ గెలిచింది.
రేవంత్ 7నిమిషాల ట్యాగ్ గెలుచుకోగా.. మిగిలిన వారు ఒక్కొక్క ట్యాగ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆఖరిలో జీరో టైమింగ్ కోసం కీర్తి, ఆరోహి, అర్జున్ పోటీ పడ్డారు. కీర్తి జీరో టైమింగ్ లో ఉందని తెలుసుకొని వెక్కివెక్కి ఏడ్చింది. ఇక వీరి ముగ్గురిలో ఎవరో ఒకరు జైలుకెళ్లాలి అని చెప్పడంతో ముగ్గురూ చర్చించుకున్నారు. అమ్మాయిలు ఇబ్బంది పడతారు.. తానే జైల్లోకి వెళ్తానని అర్జున్ చెప్పడంతో అతన్ని జైలుకి పంపించారు. ఆ తర్వాత కంటెస్టంట్స్ అంతా ఈ టాస్క్ గురించే చర్చించుకున్నారు. రేవంత్, శ్రీహాన్, శ్రీ సత్య.. అర్జున్ అమ్మాయిలపై జాలిపడి జైలుకి వెళ్లడం కరెక్ట్ కాదని చెప్పారు. అందరూ పడుకున్నాక అర్థరాత్రి ఆరోహి, ఆర్జే సూర్య ఫుడ్ దొంగతనం చేసి చాటుగా వంట చేసుకొని అర్జున్ తో కలిసి తిన్నారు.
Next Story