Tue Dec 24 2024 13:54:41 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 Day 26 : ఫస్ట్ లేడీ కెప్టెన్ గా కీర్తి.. సత్య కాళ్లు పట్టిన అర్జున్, జైల్లోకి పంపిన బిగ్ బాస్
ఈ టాస్క్ పూర్తయ్యాక అర్జున్ కల్యాణ్ శ్రీసత్య కాళ్లు పట్టాడు. కానీ.. శ్రీసత్య మాత్రం అర్జున్ ని వాడుకుని వదిలేస్తోంది.
బిగ్ బాస్ సీజన్ 6లో నాల్గవ వారం కెప్టెన్ గా కీర్తి ఎంపికైంది. ఫస్ట్ లేడీ కెప్టెన్ ఆఫ్ ది హౌస్ గా కీర్తి ఎంపికవడంపై ఇంటిసభ్యులంతా హర్షం వ్యక్తం చేశారు. కెప్టెన్సీ రేసులో నుంచి ఒక్కొక్కరు తొలగిపోగా.. చివరిగా సుదీప, శ్రీసత్య, కీర్తి ఉన్నారు. ఈ ముగ్గురికి బిగ్ బాస్ ప్రత్యేక కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. CAPTAIN అనే అక్షరాలను ఒక్కొక్కటిగా జోడించి, ఆ పదాన్ని పూర్తి చేయాలి. ఈ టాస్క్ లో శ్రీసత్య గెలుస్తుందనుకున్నారు కానీ.. అనూహ్యంగా కీర్తి గెలిచి హౌస్ కి నాల్గవ కెప్టెన్ గా ఎంపికైంది.
ఈ టాస్క్ పూర్తయ్యాక అర్జున్ కల్యాణ్ శ్రీసత్య కాళ్లు పట్టాడు. కానీ.. శ్రీసత్య మాత్రం అర్జున్ ని వాడుకుని వదిలేస్తోంది. అనంతరం వరస్ట్ ఫెర్ఫార్మర్ ఎవరో చెప్పి.. వారిని జైలుకి పంపాలని బిగ్ బాస్ ఆదేశించాడు. ఎక్కువమంది ఇంటిసభ్యులు అర్జున్ కల్యాణ్ శ్రీసత్య కోసం ఆడుతున్నాడని, ఈవారం అతనే వరస్ట్ ఫెర్ఫార్మర్ అని చెప్పారు. దీంతో మరోసారి అర్జున్ జైలుకెళ్లక తప్పలేదు. జైల్లో కూర్చున్న అర్జున్ కి శ్రీసత్య క్లాస్ తీసుకుంది. నువ్వు బిగ్ బాస్ హౌస్ కి ఎందుకు వచ్చావ్ ? నా కోసమా ? నీ కోసమా ? అని అడగ్గా.. నా కోసమే వచ్చా అని అర్జున్ చెప్పాడు. ఇకపై అమ్మాయిలు అని జాలిపడకు. నీ గేమ్ నువ్వు ఆడు అని శ్రీసత్య చెప్పింది.
అందరూ వెళ్లిపోయాక.. అర్జున్ కెమెరాతో మాట్లాడుతూ.. బిగ్ బాస్ ఈవారం ఒక్క ఛాన్స్ ఇవ్వండి. నేనేంటో చూపిస్తా అని చెప్పాడు. ఇదంతా చూసిన ప్రేక్షకులు గతవారం కూడా ఇలాగే చెప్పాడని, గేమ్ పరంగా ఏం లేదని అనుకుంటున్నారు. ఈవారం ఆరోహికి చాలా తక్కువ ఓట్స్ వచ్చినట్లు సమాచారం. మరి ఈవారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి
Next Story