Mon Dec 23 2024 18:27:26 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 Day 30 : నామినేషన్స్ డే , బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ తో హీటెక్కిన హౌస్
ఇక్కడే అసలైన ట్విస్ట్. ప్రతి వారంలాగా ఒకరినొకరు నామినేట్ చేసుకోవడం కాదు. ఇద్దరిద్దరు సభ్యుల ..
బిగ్ బాస్ సీజన్ 6 నాలుగు వారాలు పూర్తిచేసుకుని ఐదవవారంలోకి అడుగుపెట్టింది. గతవారం ఆరోహి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. సోమవారం ఎపిసోడ్ లో యథావిధిగా నామినేషన్స్ ఉంటాయి. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్. ప్రతి వారంలాగా ఒకరినొకరు నామినేట్ చేసుకోవడం కాదు. ఇద్దరిద్దరు సభ్యుల చేతులకు సంకెళ్లు వేసి ఎవరు నామినేట్ అవుతారో తేల్చుకోమన్నారు. అంతేకాదు.. ఈ వారం నుంచి రోహిత్-మెరీనా విడివిడిగా ఆడాల్సి ఉంటుందని.. నామినేషన్స్ వారిద్దరి నుంచే ప్రారంభించాలని చెప్పాడు.
మెరీనా భర్త కోసం తాను త్యాగం చేసింది. దీంతో రోహిత్ చాలా ఎమోషనల్ అయిపోయాడు. మెరీనా నామినేట్ అయింది. తర్వాత ఇనయా- శ్రీహాన్ లను పిలవగా.. ఇద్దరి మధ్యా చాలాసేపు గొడవ జరిగింది. నీకు కెప్టెన్ అయ్యే అర్హత లేదు, నువ్వు ఏం ఆడుతున్నావ్, నేను ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నా అని చెప్పుకొచ్చాడు శ్రీహాన్. నేను కూడా ఆడుతున్నా అంది ఇనయా. దానికి శ్రీహాన్ 'అప్పుడు నేను ఎక్కడ ఉన్నాను ఇంట్లో' అంటూ వెటకారం చేశాడు. శ్రీహాన్ మాటలకు విసిగిపోయి.. తాను స్ట్రాంగ్ కంటెస్టంట్ అని.. నామినేట్ అవుతున్నానని తెలిపింది.
వాసంతి- సుదీప లలో వాసంతి నామినేట్ అయింది. శ్రీసత్య - అర్జున్ కళ్యాణ్ లలో శ్రీసత్య మళ్లీ అవకాశాన్ని వాడుకుంది. నేను డబ్బు కోసమే వచ్చా.. ఇంకో వారం ఉంటే నాకు ఇంకా ఎక్కువ డబ్బు వస్తుంది. నేను ఉంటాను అనడంతో.. అర్జున్ నామినేట్ అయ్యాడు. రేవంత్- ఆదిరెడ్డిలలో ఆదిరెడ్డి, ఫైమా - సూర్యలలో ఫైమా నామినేట్ అయ్యారు. గీతూ- చంటిలలో చంటి, రాజ్- బాలాదిత్యలలో బాలాదిత్య నామినేట్ అయ్యారు. మొత్తంగా ఈ వారం.. మెరీనా, వాసంతి, అర్జున్, ఆదిరెడ్డి, ఫైమా, చంటి, బాలాదిత్య నామినేట్ అయ్యారు. ఈవారం ఎవరూ ఆట బాగా ఆడి హౌస్ లో ఉంటారు ? ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.
Next Story