Mon Dec 23 2024 14:17:15 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 Day 57 : నామినేషన్లలో రెచ్చిపోయిన ఇనయ.. ఈవారం లిస్ట్ ఇదే..
ఆదిరెడ్డి.. ఇనయా, రేవంత్ లను నామినేట్ చేశాడు. మెరీనా.. శ్రీసత్య, గీతూలని నామినేట్ చేసింది. బాలాదిత్య.. శ్రీసత్య, ఫైమాలని..
బిగ్ బాస్ సీజన్ 6.. అప్పుడే 8 వారాలు పూర్తి చేసుకుని 10వ వారంలోకి అడుగుపెట్టింది. 8వ వారం అనూహ్యంగా సూర్య ఎలిమినేట్ అవడం తెలిసిందే. సోమవారం యథావిదిగా నామినేషన్లతో హౌసంతా హీటెక్కింది. హౌజ్ లో ఇప్పటికే 8 మంది వెళ్లిపోగా ఇంకా 13 మంది మిగిలారు. ఈవారం నామినేషన్లలో భాగంగా.. దిష్టిబొమ్మలపై కుండపెట్టి.. నామినేషన్ కు రీజన్ చెప్పి ఆ కుండను పగలగొట్టాలి. గీతూ తో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. గీతూ భార్యాభర్తలైన రోహిత్, మెరీనాలను నామినేట్ చేసింది. దాంతో మెరీనాకి, గీతూకి గొడవ అయింది. రేవంత్… కీర్తి, ఇనయాలను నామినేట్ చేయగా, ఇనయ- రేవంత్ ల మధ్య గట్టి గొడవే జరిగింది.
ఈ సారి నామినేషన్స్ లో అందరూ గీతూ, ఇనయాలని టార్గెట్ చేశారు. ముఖ్యంగా ఇనయ నామినేట్ చేయడంతోనే సూర్య బయటికి వెళ్లిపోయాడన్న పాయింట్ బాగా వినిపించింది. గీతూ ఓవర్ యాక్షన్, ఎవరి మాట వినకపోవడం, రూల్స్ కూడా పాటించకుండా నా ఇష్టం అనడంతో గీతూ మీద చాలా నెగిటివిటి వచ్చింది. ఇక ఇనయా తనకు ఎటు కావాలంటే అటు ప్లేట్ తిప్పేయడం, సూర్యకి వెన్నుపోటు పొడవడంతో ఇనయా అవసరానికి తగ్గట్టు మారిపోతుంది అంటూ ఎక్కువమంది ఇనయాని కూడా నామినేట్ చేశారు.
ఆదిరెడ్డి.. ఇనయా, రేవంత్ లను నామినేట్ చేశాడు. మెరీనా.. శ్రీసత్య, గీతూలని నామినేట్ చేసింది. బాలాదిత్య.. శ్రీసత్య, ఫైమాలని నామినేట్ చేశాడు. కీర్తి.. గీతూ, రేవంత్ లని నామినేట్ చేసింది. రోహిత్.. గీతూ, శ్రీసత్యలని నామినేట్ చేశాడు. వాసంతి.. గీతూ, రేవంత్ లని నామినేట్ చేసింది. రాజ్.. గీతూ, బాలాదిత్యలని నామినేట్ చేశాడు. ఫైమా.. బాలాదిత్య, ఇనయాలని నామినేట్ చేసింది. శ్రీసత్య.. బాలాదిత్య, ఇనయాలని నామినేట్ చేసింది. ఇనయా, శ్రీసత్య గట్టిగానే గొడవపడ్డారు. ఇనయ.. గీతూ, ఆదిరెడ్డి లని నామినేట్ చేసింది.
ఈ సమయంలో ఆదిరెడ్డి ఇనయాతో ఓ ఆట ఆడుకున్నాడు. వీరిద్దరి మధ్య కూడా గట్టిగానే గొడవ అయింది. ఇక చివరగా శ్రీహన్.. కీర్తి, ఇనయాలను నామినేట్ చేశాడు. శ్రీహాన్ ని వెన్నుపోటు పొడవడంతో వాటన్నిటిని గుర్తు చేస్తూ కౌంటర్లు ఇస్తూ ఇనయాపై పంచులేస్తూ తనని నామినేట్ చేశాడు. మొత్తానికి హౌజ్ లో 13 మంది ఉండగా 10 మంది ఈ వారం నామినేట్ అయ్యారు. ఈ వారం నామినేషన్స్ లో రేవంత్, ఆదిరెడ్డి, గీతూ, బాలాదిత్య, కీర్తి, శ్రీసత్య, ఇనయా, రోహిత్, మెరీనా, ఫైమాలు ఉన్నారు. రాజ్, వాసంతి, శ్రీహన్ లకి ఒక్క ఓటు కూడా పడకపోవడం విశేషం.
Next Story