Mon Dec 23 2024 17:32:36 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 Day 59 : హౌస్ మేట్స్ కి కర్రలిచ్చి కొట్టుకోమన్న బిగ్బాస్.. రచ్చరచ్చ చేసిన కంటెస్టెంట్స్
మామూలుగానే కొట్టుకనేంతవరకూ వెళ్లే కంటెస్టంట్స్ కర్రలిచ్చి కొట్టుకోమంటే ఆగుతారా రచ్చరచ్చ చేశారు. ఓ టాస్కులో ఇంటి సభ్యుల
బిగ్బాస్ సీజన్ 6 మొదటి ఆరువారాలు పేలవంగా సాగినా.. గడిచిన రెండు మూడు వారాలుగా కంటెస్టెంట్స్ మధ్య పోటీ రసవత్తరంగా జరుగుతోంది. వీకెండ్ ఎపిసోడ్లలో నవ్వుతూ ఆడే కంటెస్టెంట్స్ లో నామినేషన్లతో హీట్ మొదలవుతోంది. బిగ్బాస్ ఇచ్చే టాస్కులు కంటెస్టెంట్స్ మధ్య తీవ్ర గొడవలు పెడతాయన్న సంగతి తెలిసిందే. నువ్వా-నేనా అన్నట్టుగా ఒకరికొకరు గట్టిపోటీ ఇస్తున్నారు. టైటిల్ నాదంటే నాదని ఇనయ ఇప్పటికే పలుమార్లు అన్నారు. ఇక బిగ్బాస్ ఇచ్చే టాస్కులు కంటెస్టెంట్స్ మధ్య తీవ్ర గొడవలు పెడతాయన్న సంగతి తెలిసిందే. ఒక్కొక్కసారి కొట్టుకోడానికి కూడా సిద్ధమవుతారు కంటెస్టెంట్స్. ఈ సారి బిగ్బాస్ ఏకంగా కర్రలు ఇచ్చి కొట్టుకునే టాస్క్ ఇచ్చాడు.
మామూలుగానే కొట్టుకనేంతవరకూ వెళ్లే కంటెస్టంట్స్ కర్రలిచ్చి కొట్టుకోమంటే ఆగుతారా రచ్చరచ్చ చేశారు. ఓ టాస్కులో ఇంటి సభ్యులను రెడ్ టీం అండ్ బ్లూ టీంగా విడగొట్టారు. ఈ టాస్క్ లో భాగంగా రెడ్ టీం వాళ్ళు ముగ్గురు, బ్లూ టీం వాళ్ళు ముగ్గురు ఎదురెదురుగా గోడల మీద నిలబడతారు. వీరికి కర్రలు ఇస్తే ఆ కర్రలతో కొట్టుకుంటూ అవతలి వాళ్ళని గోడ మీద నుంచి పడేయాలి. రెడ్ టీం నుంచి రేవంత్, ఫైమా, శ్రీహన్ బరిలోకి దిగగా బ్లూ టీం నుంచి మెరీనా, వాసంతి, ఇనయాలు దిగారు. ఈ గేమ్ లో భాగంగా ఇనయ, శ్రీహాన్ మధ్య గొడవ గట్టిగానే జరిగింది.
ఈ మాటల మధ్యలో ఇనయా శ్రీహాన్ ని ఉద్దేశించి నువ్వు శ్రీసత్యతో బెడ్ మీద పడుకుంటావు అని అనడంతో శ్రీసత్య కూడా ఇనయాతో గొడవ పడింది. శ్రీసత్య, శ్రీహాన్ కలిసి ఇనయాని ఆడేసుకున్నారు. ఇక బాలాదిత్య లైటర్ గీతూ దొంగతనం చేయడంతో బాలాదిత్య, గీతూ మధ్య మళ్లీ గొడవ అయింది. సిగరెట్ తాగితే తప్పా? నీకెందుకు ? అంటూ బాలాదిత్య ఎమోషనల్ కూడా అయ్యాడు. ఇక గీతూ గురించి తెలిసిందేగా. ఎదుటివారి వీక్ పాయింట్ తో ఆడుకుంటుంది. గీతూ కన్నింగ్ నెస్ కోసం కూడా బిగ్ బాస్ చూసేవారున్నారు.
ఆదిరెడ్డిని బిగ్బాస్ కన్ఫెషన్ రూమ్ కి పిలిచారు. ఆదిరెడ్డికి ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. బాత్ రూమ్ ని డర్టీగా మార్చి రెడ్ టీం సభ్యులలో ఒకరిపై నింద వేయాలని, కావాలంటే మీ గ్రూప్ వాళ్ళ సాయం తీసుకోవచ్చని బిగ్బాస్ చెప్పాడు. మరి ఈ టాస్క్ వల్ల రెండు టీమ్ ల మధ్య ఎన్నిగొడవలొస్తాయో ? ఆదిరెడ్డి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ని పూర్తి చేస్తాడో లేదో చూడాలి.
Next Story