Mon Dec 23 2024 08:34:15 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 Day 88 : ఆ ఎనిమిది మంది టైటిల్ ఎందుకు విన్ అవ్వాలనుకుంటున్నారో తెలుసా ?
శ్రీసత్య హౌస్ లోకి వచ్చినప్పటి నుండి డబ్బే ముఖ్యమని, డబ్బుకోసమే వచ్చానని క్లారిటీగా చెప్పింది. అర్జున్-శ్రీసత్యల మధ్య..
బిగ్ బాస్ సీజన్ 6.. గ్రాండ్ ఫినాలేకి సమయం దగ్గరపడుతున్న కొద్దీ.. ఆట రసవత్తరంగా సాగుతోంది. ఈ వారమంతా టికెట్ టు ఫినాలే రేస్ జరుగుతోంది. ఫైనల్ పోటీ రేవంత్-శ్రీహాన్ ల మధ్య ఆగింది. మిగతా వారంతా గేమ్ నుండి అవుటయ్యారు. 88వరోజు టెలీకాస్ట్ అయిన ఎపిసోడ్ లో.. గుడ్డు జాగ్రత్త అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో రేవంత్-శ్రీసత్యల మధ్య మళ్లీ గొడవ జరిగింది. శ్రీహాన్ 10 పాయింట్లతో టాప్ పొజిషన్ లో నిలిచాడు. ఆ తర్వాత.. హౌస్ లో ఉన్న 8 మందిని అసలు బిగ్ బాస్ కప్పు ఎందుకు గెలవాలనుకుంటున్నారని బిగ్ బాస్ ప్రశ్నించగా.. ఒక్కొక్కరు ఒక్కో రీజన్ చెప్పారు.
ముందుగా శ్రీహాన్.. మా అమ్మకి ఇచ్చిన మాట కోసం ట్రోఫీ గెలవాలి, మా అమ్మ నన్ను అడిగిన మొదటి కోరిక అది అని చెప్పాడు. రోహిత్.. మా నాన్న పేరు నిలబెట్టేందుకు కప్పు గెలవాలి అన్నాడు. రేవంత్.. బిగ్బాస్ షోలో మొదటి నుంచి ప్రతి టాస్క్ లో బాగా ఆడుతున్నా. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ముందుకి వెళ్తున్నా. అందుకే ట్రోఫీ నాకు చాలా ముఖ్యం అని చెప్పాడు. ఇక శ్రీసత్య.. నా లైఫ్ లో ఏది అంత ఈజీగా దొరకలేదు. పోరాడి సాధించుకున్నా. అలాంటిది బిగ్బాస్ కప్పు గెలిస్తే ఆ కిక్కే వేరు. మా అమ్మ నాన్నలు కూడా కప్పు గెలిచి రమ్మన్నారు, వాళ్ళ కోసం అయినా కప్పు గెలవాలి అని చెప్పింది.
శ్రీసత్య హౌస్ లోకి వచ్చినప్పటి నుండి డబ్బే ముఖ్యమని, డబ్బుకోసమే వచ్చానని క్లారిటీగా చెప్పింది. అర్జున్-శ్రీసత్యల మధ్య నామినేషన్ల సమయంలోనూ ఇదే చెప్పింది. అర్జున్ ఏమీ అనలేక సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. తన తల్లికి చికిత్స చేయించేందుకు డబ్బులు చాలా అవసరమని అందుకే వచ్చానని చెప్పుకొచ్చింది. ఇక కీర్తి.. నా లాంటి ఒంటరి అమ్మాయిలకి ఆదర్శంగా నిలవడానికి కప్పు కొట్టాలి అని చెప్పింది.
ఫైమా.. మా కుటుంబం కోసం, అమ్మాయిలకి ఆదర్శంగా నిలబడేందుకు ట్రోఫీ గెలవాలని ఉంది అని చెప్పింది. ఆదిరెడ్డి.. మొదటిసారి ఓ కామన్ మ్యాన్ ఇన్ని రోజులు హౌజ్ లో ఉన్నాడు. అడ్డదారులు తొక్కకుండా జెన్యూన్ గా ఆడి కప్పు కొడితే అదే హ్యాపీ అని చెప్పాడు. కానీ ఆది రెడ్డి కామన్ మ్యాన్ ఎలా అవుతాడని నెట్టింట్లో పెద్ద చర్చే జరుగుతుంది. కామన్ మ్యాన్ బిగ్ బాస్ రివ్యూవర్ అయి.. హౌస్ లోకి అడుగుపెట్టాడు. అలా చూసుకుంటే రేవంత్, శ్రీహాన్ లాంటి వాళ్ళు కూడా కామన్ మ్యాన్సే అవుతారని వాళ్ల అభిమానులు అంటున్నారు. ఆదిరెడ్డి పెద్ద గేమ్ మ్యానిపులేటర్ అని, అతను బయట అంతా ప్లాన్ చేసుకుని వచ్చాడని టాక్.
ఇక చివరగా ఇనయా.. నువ్వు అమ్మాయివి, ఏం చేయలేవు, చదువుకోలేదు. ఇలా చాలా మంది చాలా అన్నారు. వాళ్లందరికీ సమాధానం చెప్పడానికి అయినా కప్పు గెలవాలి. కప్పు గెలిచి మా నాన్నకి అంకితమివ్వాలి అని చెప్పింది. కానీ ఇనయా.. టాప్ 3 లేదా రన్నరప్ అవ్వొచ్చని తెలుస్తోంది. మరి వీరిలో ఎవరు కప్పు గెలుస్తారో చూడాలి.
Next Story