Mon Dec 23 2024 15:31:10 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 : దసరా స్పెషల్..ఆటపాటలతో ఫుల్ ఎంటర్టైన్ మెంట్, ఎలిమినేషన్ తో కంటతడి
ఆఖరిగా ఆర్మ్ రెజ్లింగ్ పోటీ పెట్టగా.. రాజ్ - ఫైమా, రేవంత్- గీతూ, అర్జున్ -శ్రీసత్య, రోహిత్- మరీనా లు పోటీ పడ్డారు. ఈ పోటీలో
బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభమై నాలుగు వారాలు పూర్తయ్యాయి. 10 రోజుల దసరా, బతుకమ్మ పండుగల స్పెషల్ ఎపిసోడ్ నిన్న టెలీకాస్ట్ అయింది. నాలుగు గంటల పాటు బిగ్ బాస్ 6 ప్రేక్షకులను అలరించింది. మధ్యమధ్యలో సింగర్స్ పాటలు, నటీమణుల మెడ్లీ డ్యాన్స్ లు అలరించాయి. ఇక హౌస్ మేట్స్ కి నాగార్జున వివిధ పోటీ రౌండ్లను నిర్వహించారు. గర్ల్స్ వర్సెస్ బాయ్స్ డ్యాన్సులు, ఆర్మ్ రెజ్లింగ్ ఆకట్టుకున్నాయి.
నామినేషన్లలో ఉన్న 10 మందిలో ఒకరిని సేవ్ చేయడంతో ఎపిసోడ్ మొదలైంది. ముందుగా గీతూ సేవ్ అయింది. కీర్తిని చంటి కెమెరాల్లో కనిపించడం కోసమే పనిచేస్తుందని అన్నాడని భావించి ఈ సీజన్ మొత్తం అతడిని కెప్టెన్సీ పోటీ నుంచి తప్పించిన విషయం విధితమే. చంటి కీర్తిని ఏ ఉద్దేశంతో అలా అన్నాడో నాగార్జున చూపించారు. దాంతో చంటి పాజిటివ్ గానే అన్నాడు కానీ.. గీతూ కీర్తికి చెప్పేటపుడు దాని అర్థం మారిపోవడంతో మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఇక గీతూ- చంటిల విషయంపై బాలాదిత్య, ఫైమా కాంప్రమైజ్ చేసి వారిద్దరి మధ్యన వచ్చిన గ్యాప్ ను తగ్గించాలని నాగార్జున సూచించారు.
అమ్మాయిలు అబ్బాయిలను రెండు టీమ్ లుగా చేసి.. రెండు టీమ్ ల మధ్య డ్యాన్స్, రెజ్లింగ్, ఈటింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో అమ్మాయిలే విన్ అయ్యారు. రెండు ప్లేట్లు జిలేబీలు పెట్టగా.. శ్రీహాన్, శ్రీసత్య పోటీ పడ్డారు. శ్రీసత్య ఎక్కువ జిలేబీలు తిని విన్నర్ గా నిలిచింది. అనంతరం డ్యాన్స్ పోటీలు పెట్టగా.. శ్రీసత్య- అర్జున్ కు పోటీగా డ్యాన్స్ చేసి ఇరగదీసింది. ఆదిరెడ్డి - రాజ్ చేసిన డ్యాన్స్ నవ్వులు పూయించింది. తర్వాత బతుకమ్మను తయారు చేయమన్నారు. అబ్బాయిల టీమ్ లో సూర్య, అమ్మాయిల టీమ్ లో ఆరోహి బతుకమ్మలను పేర్చగా.. మళ్లీ అమ్మాయిలే గెలిచారు. తర్వాత బిటర్ లడ్డూ, స్వీట్ లడ్డూలు పెట్టి ఎవరికి ఏది ఇస్తారు ? ఎందుకిస్తున్నారో చెప్పమన్నారు. హౌస్ మేట్స్ తమకు నచ్చిన వారికి స్వీట్, నచ్చనివారికి బిటర్ లడ్డూ తినిపించి అందుకు కారణాలు చెప్పారు.
ఆఖరిగా ఆర్మ్ రెజ్లింగ్ పోటీ పెట్టగా.. రాజ్ - ఫైమా, రేవంత్- గీతూ, అర్జున్ -శ్రీసత్య, రోహిత్- మరీనా లు పోటీ పడ్డారు. ఈ పోటీలో అబ్బాయిలదే విజయం. రేవంత్ తో పోటీకొచ్చిన గీతూ.. గట్టిపోటీనే ఇచ్చింది. అర్జున్ తో పోటీకి దిగిన శ్రీసత్య అన్నం తినిపిస్తానంటూ కబుర్లు చెప్పి ఓడించింది. మొత్తం మీద అమ్మాయిల టీమ్ గెలవడంతో.. బిగ్ బాస్ వారికి దసరా కానుక పంపారు. నామినేషన్లలో ఉన్నవారిలో చివరిగా ఆరోహి- సుదీప ఉండగా.. ఆరోహి ఎలిమినేట్ అయింది. దాంతో ఒకరిద్దరు మినహా మిగతా వారంతా ఏడ్చారు. సూర్య, కీర్తి ఆరోహి ఎలిమినేషన్ ను తట్టుకోలేకపోయారు.
Next Story