Mon Dec 23 2024 03:13:04 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 : మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టంటే..
ఈసారి ఫినాలే వీక్ లో ఆరుగురు ఉండగా.. ఒకరిని మిడ్ వీడ్ ఎలిమినేట్ చేస్తారంటూ రెండువారాలుగా ..
బిగ్ బాస్ సీజన్ 6.. మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. ప్రస్తుతానికి హౌస్ లో ఆరుగురు సభ్యులుండగా.. ఆరుగురి జర్నీలను బిగ్ బాస్ ఎంతో అందంగా చూపించాడు. కానీ.. ప్రతి సీజన్ లో గ్రాండ్ ఫినాలేకి ఐదుగురు కంటెస్టంట్సే ఉంటారు. ఈసారి ఫినాలే వీక్ లో ఆరుగురు ఉండగా.. ఒకరిని మిడ్ వీడ్ ఎలిమినేట్ చేస్తారంటూ రెండువారాలుగా ప్రచారం జరుగుతోంది. అనుకున్నట్టుగానే మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగినట్లు లీకులు చెబుతున్నాయి. టాప్ 5లో ఉంటుందనుకున్న శ్రీసత్య ఎలిమినేట్ అయినట్లు సమాచారం. ఇది నిజమో కాదో తెలియాలంటే ఆ ఎపిసోడ్ ప్రసారమయ్యేవరకూ ఎదురుచూడాల్సిందే.
ఇక విన్నర్ ఎవరన్న విషయానికొస్తే.. బిగ్ బాస్ టీమ్ గతవారం ఇనయాను ఎలిమినేట్ చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆమె ఓటింగ్ లో టాప్ లో ఉన్నా.. లీస్ట్ లో ఉన్న ఆదిరెడ్డిని సేవ్ చేసి ఇనయాని కావాలని ఎలిమినేట్ చేశారంటూ.. ఒక హ్యాష్ టాగ్ కూడా ట్రెండ్ అయింది. అప్పటి నుండి ఆదిరెడ్డి ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గిపోవడంతో.. బిగ్ బాస్ మేనేజ్ మెంట్ ఆదిరెడ్డిని విన్నర్ గా కాకుండా టాప్ 3లో ఉంచాలని ఫిక్సైనట్లు సమాచారం. ఇక రేవంత్, శ్రీహాన్, కీర్తి, రోహిత్ లలో ఎవరు విన్నర్ కావచ్చంటే.. రేవంత్, శ్రీహాన్ లకు ఆ ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరినీ కాదని రోహిత్ కూడా విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో.. ఎవరితో ఎలా మాట్లాడాలి? ఇలా విన్నర్ కు కావాల్సిన క్వాలిటీస్ అతనిలో ఉన్నాయని రోహిత్ సపోర్టర్స్ అంటున్నారు.
- Tags
- bigg boss 6
Next Story