Mon Dec 23 2024 03:32:14 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 Winner : అందరూ అనుకున్నట్లు విన్నర్ రేవంతే.. రన్నర్ గా విన్నర్ శ్రీహాన్
విన్నింగ్ అమౌంట్లో కొంత అమౌంట్ ఉన్న బాక్స్ రవితేజకి ఇచ్చి హౌస్ లోకి పంపుతారు. కానీ హౌస్ లోపల రవితేజ..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 నిన్నటితో (డిసెంబర్ 18) ముగిసింది. ఆదివారం సాయంత్రం గ్రాండ్ గా ప్రారంభమైన గ్రాండ్ ఫినాలే లో ఎలిమినేట్ అయిన 16 మంది హౌస్ మేట్స్ విచ్చేశారు. ఆ తర్వాత నిఖిల్, రాధ, రవితేజ, శ్రీలీల గెస్టులుగా విచ్చేశారు. మధ్యలో సింగర్స్ పాటలు, ఊర్వశి రౌతేలా స్పెషల్ డ్యాన్స్ ఆకట్టుకున్నాయి. ఎపిసోడ్ ప్రారంభానికి బిగ్ బాస్ హౌస్ లో ఐదుగురు ఉండగా.. ఒక కంటెస్టంట్ ని ఎలిమినేట్ చేసి బయటికి తీసుకొచ్చేందుకు హీరో నిఖిల్ ని పంపించారు. రెడ్ హ్యాట్ తీసుకుని హౌస్ లోకి వెళ్లిన నిఖిల్.. రోహిత్ కు రెడ్ హ్యాట్ పెట్టి బయటికి తీసుకొచ్చారు. రోహిత్ ఎలిమినేషన్ తో అతని తల్లి కంటతడి పెట్టుకున్నారు.
ఇక టాప్ 4 కంటెస్టంట్లు ఉండగా.. ధమాకా ప్రమోషన్స్ కోసం రవితేజ, శ్రీలీల వచ్చారు. కొద్దిసేపు సినిమా ముచ్చట్లు చెప్పిన అనంతరం.. ఒక కంటెస్టంట్ ను ఎలిమినేట్ చేసే ప్రాసెస్ పెట్టారు. స్విమ్మింగ్ పూల్ లో కొంత ఎత్తులో కీర్తి, రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డిలకు సంబంధించిన మానిక్యూల్స్ పెట్టారు. వాటిలో ఎవరిది పూల్ లో పడితే వారు ఎలిమినేట్. ఈ క్రమంలో ఆదిరెడ్డి ఫొటో ఉన్న మ్యానిక్యూల్ పూల్ పడగా.. అతను ఎలిమినేట్ అయి వెళ్లిపోతాడు. స్టేజ్ పై ఆదిరెడ్డితో రవితేజ కాస్త సరదాగా మాట్లాడతారు. టాప్ 3 ఎలిమినేషన్ మొదలవుతుంది.
విన్నింగ్ అమౌంట్లో కొంత అమౌంట్ ఉన్న బాక్స్ రవితేజకి ఇచ్చి హౌస్ లోకి పంపుతారు. కానీ హౌస్ లోపల రవితేజ, బయట నాగార్జున ఎంత చెప్పిన ముగ్గురిలో ఎవరూ ఆ బాక్స్ తీసుకునేందుకు కమిట్ అవరు. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం కీర్తిని బయటికి తీసుకొస్తారు రవితేజ. టాప్ 2 రేవంత్, శ్రీహాన్ హౌస్ లో ఉండగా.. వారికోసం నాగార్జునే హౌస్ లోకి వెళ్తారు. విన్నర్ అమౌంట్ లో 20 లక్షలు ఆఫరిచ్చి.. ఎవరోఒకరు ఆ అమౌంట్ తీసుకుని బయటికి రావాలని చెప్తారు. కానీ కమిట్ అవరు. తర్వాత 30లక్షలు ఆఫరిస్తారు. అయినా తమకు ట్రోఫీనే కావాలన్నారు. దాంతో వాళ్ల ఫ్యామిలీ, ఎక్స్ కంటెస్టంట్స్ అభిప్రాయం అడిగారు నాగార్జున.
సగం మంది శ్రీహాన్ ను ఆ బాక్స్ తీసుకోవాలని చెప్తారు. అయినా కమిట్ అవ్వకపోవడంతో.. అమౌంట్ ను రూ.40లక్షలకు పెంచగా.. ఆ అమౌంట్ తీసుకోమని చెప్తారు శ్రీహాన్ పేరెంట్స్. దాంతో శ్రీహాన్ ఆ బాక్స్ తీసుకునేందుకు ఒప్పుకుంటారు. ఇక ఇద్దరినీ తీసుకుని బయటికి వచ్చిన నాగార్జున.. రేవంత్ ను విన్నర్ గా డిక్లేర్ చేస్తారు. కానీ.. గత సీజన్లలో లేనట్టుగా ఈ సీజన్లో ఇద్దరు విన్నర్స్ అవడం విశేషం. ఒకరు ట్రోఫీ విజేత, మరొకరు క్యాష్ ప్రైజ్ విజేత. కానీ.. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం శ్రీహాన్ టాప్ 1 పొజిషన్లో ఉన్నాడని నాగార్జున చెప్పడంతో.. శ్రీహాన్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. విన్నరైన రేవంత్ రూ.10లక్షలు క్యాష్, సువర్ణభూమి తరపున 605 గజాల స్థలం, మారుతి సుజుకీ బ్రెజా కారు గెలుచుకున్నాడు. ఈ ట్రోఫీని తన కూతురికి ఇస్తానని చెప్పాడు రేవంత్.
శ్రీహాన్ విషయానికొస్తే.. రూ.40 లక్షలే కాకుండా.. లెన్స్ కార్ట్ సూపర్ స్టార్ గా రూ.5 లక్షలు గెలుచుకున్నాడు. 15 వారాలపాటు హౌస్ లో ఉన్నందుకు.. అతనికు రెమ్యునరేషన్ కూడా వస్తుంది. ఈ మొత్తం కలిపితే.. బిగ్ బాస్ సీజన్ 6లో అత్యధిక క్యాష్ గెలుచుకున్నది శ్రీహానే అవుతాడు.
Next Story