Mon Dec 23 2024 03:46:40 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 Winner : బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ అతనే.. గూగుల్ లో మారిన పేరు
బిగ్ బాస్ సీజన్ 4లోనూ గ్రాండ్ ఫినాలేకి ముందు గూగుల్ అభిజిత్ పేరును చూపించింది. ఈసారి కూడా గూగుల్ చెప్పినట్టు ..
బిగ్ బాస్ సీజన్ 6 ఆఖరి దశకు చేరుకుంది. రేపు సాయంత్రం (డిసెంబర్ 18) గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఫినాలే ముగిసేవరకూ.. విన్నర్ ఎవరనే దానిపై రకరకాల ప్రచారాలు జరుగుతుంటాయి. నిన్నటి ఎపిసోడ్ లో శ్రీసత్య ఎలిమినేట్ అవ్వగా.. ప్రస్తుతం హౌస్ లో ఐదుగురున్నారు. రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, కీర్తి, రోహిత్. వీరిలో ఎవరు విన్నర్ అవుతారన్నదానిపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. నాలుగురోజుల క్రితం వరకూ ఆదిరెడ్డి విన్ అవుతాడని ప్రచారం జరిగింది. రెండురోజులుగా గూగుల్ లో who is the winner of bigg boss 6 telugu అని సెర్చ్ చేస్తే రోహిత్ పేరు చూపించింది.
బిగ్ బాస్ సీజన్ 4లోనూ గ్రాండ్ ఫినాలేకి ముందు గూగుల్ అభిజిత్ పేరును చూపించింది. ఈసారి కూడా గూగుల్ చెప్పినట్టు రోహిత్ విన్నర్ అవుతాడనుకున్నారు. కానీ ఇప్పుడు.. సీజన్ 6 విన్నర్ రేవంత్ అని లీకైంది. సోషల్ మీడియాలో రేవంత్ కు అడ్వాన్స్ గా కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు వస్తున్నాయి. నిన్న రాత్రి 11.59 గంటలకు ఓటింగ్ లైన్స్ ముగియగా.. మొదటి నుండి వచ్చిన ఓట్లన్నింటినీ కలిపి చూస్తే రేవంతే విన్నర్. కానీ రేవంత్ కి కోపం ఎక్కువ. డే 1 నుండి తన కోపాన్ని తగ్గించుకుంటానని చెబుతున్నాడు కానీ.. ఎక్కడా తగ్గలేదు. సింగర్ గా అతనికున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.
ఓటింగ్ ప్రకారం రేవంత్ విన్నర్ గా నిలిచినట్లు సమాచారం. ఇక విన్నర్ కి రూ.50 లక్షల ప్రైజ్ మనీ, 600 గజాల స్థలంతో పాటు.. ఒక కారు బహుమతిగా రానున్నాయి. ఇక మొదటి రన్నరప్ గా శ్రీహాన్ నిలిచినట్లు తెలుస్తోంది. దాంతో విన్నర్, రన్నర్ లకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక గ్రాండ్ ఫినాలే ఈవెంట్ కి ఎవరెవరు గెస్టులుగా విచ్చేస్తారో చూడాలి.
Next Story