Mon Dec 23 2024 16:39:15 GMT+0000 (Coordinated Universal Time)
ఈవారం ఊహించని ఎలిమినేషన్.. అందుకేనా ?
ఆ కంటెస్టంట్ ఎలిమినేట్ అవుతాడని ఎవరూ ఊహించరు. కానీ.. తప్పనిసరి పరిస్థితుల్లో బిగ్ బాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు..
బిగ్ బాస్.. ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకుని.. ఆరో సీజన్ లో అడుగుపెట్టి 8 వారాలవుతోంది. ప్రతివారం ఒక్కో కంటెస్టంట్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతూ.. చివరికి ఒకరు విజేతగా నిలుస్తారు. కానీ.. రెండువారాలుగా హౌస్ లో ఊహించని ఎలిమినేషన్లు జరుగుతున్నాయి. అప్పట్లో నేహా ఎలిమినేషన్ కరెక్ట్ కాదన్న వాదనలు వినిపించాయి. గతవారం అర్జున్ ఎలిమినేట్ అవగా.. అర్జున్ కి ఓట్లు ఎక్కువగా ఉన్నా.. కావాలనే ఎలిమినేట్ చేశారంటూ ఫ్యాన్స్ బిగ్ బాస్ పై ఫైరయ్యారు. ఈవారం హౌస్ నుంచి ఊహించని ఎలిమినేషన్ జరగనుంది.
ఆ కంటెస్టంట్ ఎలిమినేట్ అవుతాడని ఎవరూ ఊహించరు. కానీ.. తప్పనిసరి పరిస్థితుల్లో బిగ్ బాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శని, ఆదివారాలకు సంబంధించిన రెండు ఎపిసోడ్ల షూటింగ్.. శనివారం పూర్తి చేస్తారు నాగార్జున. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారన్న విషయం ఒకరోజు ముందే లీకవుతోంది. అందుకే వీకెండ్ ఎపిసోడ్లకు కూడా పెద్దగా టీఆర్పీ రావట్లేదన్నది వాస్తవం.
ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ఎవరు లీక్ అవుతున్నారనే విషయం తెలిసిపోయింది. నిజానికి గత వారం బిగ్ బాస్ హౌస్ కి కెప్టెన్ కూడా లేకపోవడంతో హౌస్ లో ఉన్న 14 మంది ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు. ఈవారం హౌస్ లో ఉన్న కంటెస్టంట్స్ అంతా నామినేషన్స్ లో ఉన్నారు. ఎప్పటిలాగే అందరికన్నా రేవంత్ కు అత్యధిక ఓటింగ్స్ వచ్చాయి. ఇక తాజాగా ఇనయా సుల్తానా, ఆర్జె సూర్య మధ్య జరుగుతున్న వ్యవహారాన్ని చూడలేకపోతున్న వీక్షకులు ఆర్జె సూర్యను ఇంటికి పంపించేందుకు సిద్ధమయ్యారు.
ఆర్జే సూర్య వెరీ టాలెంటెడ్ పర్సన్. కానీ.. బిగ్ బాస్ హౌస్ లో ఆరోహితో అతను హద్దులుమీరి ప్రవర్తించడం అందరినీ ఇబ్బందికి గురిచేసింది. ఆరోహి ఎలిమినేషన్ తర్వాత.. ఇనయతో అదే రీతిలో ప్రవర్తించడంతో పాటుగా.. గత సీజన్లలో లేనివిధంగా.. ఈ సీజన్లో వాళ్లిద్దరూ హౌస్ లో బావ మరదళ్ళుగా చలామణి అవుతుండటాన్ని బిగ్ బాస్ యాజమాన్యమే సీరియస్ గా తీసుకున్నట్లు తెలిసింది. అలాగే.. బిగ్ బాస్ షో పై ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ ను దృష్టిలో ఉంచుకుని.. షో ని కాపాడుకునేందుకు ఈ వీక్ ఆర్జే సూర్యను ఎలిమినేట్ చేసినట్లు సమాచారం. ఇది ఎంతవరకూ నిజమన్నది ఆదివారం ఎపిసోడ్ లో తెలుస్తుంది.
Next Story