Mon Dec 23 2024 18:10:37 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss6 Day 21 : నేహా ఎలిమినేట్.. బెస్ట్ కంటెస్టంట్ బాలాదిత్య.. వింత టాస్కులిచ్చిన బిగ్ బాస్
ఇంటి సభ్యులకు ఆ టాగ్ ఇవ్వాలని చెప్పాడు బిగ్ బాస్. ఇందులో పాము, గాడిద, ఊసరవెల్లి, ఏనుగు, సింహం.. లాంటి..
బిగ్ బాస్ సీజన్ 6 21వ రోజు ఎపిసోడ్ లో హౌస్ నుంచి అందరూ ఊహించినట్లే నేహా చౌదరి ఎలిమినేట్ అయింది. ఆదివారం ఎపిసోడ్ లో కంటెస్టంట్లకు భిన్నమైన టాస్కులిచ్చాడు బిగ్ బాస్. మొదటి టాస్క్ సుత్తిదెబ్బ. ఇందులో కంటెస్టెంట్స్ ఒక్కొక్కరికి ఒక్కో ట్యాగ్ ఇవ్వాలి అక్కడ ఉన్న ఆడియన్స్ దానికి ఒప్పుకుంటే ఓకే. లేకపోతే సుత్తిదెబ్బ తినాల్సి ఉంటుంది. ఇందులో నోటి దూల, హార్ట్ లెస్, బిట్టర్, యూజ్ లెస్ అనే కొన్ని వర్డ్స్ ని ఇచ్చారు. దీంట్లో కంటెస్టెంట్స్, ఆడియన్స్, నాగార్జున కూడా గీతూకి నోటిదూల అని తేల్చేశారు.
ఇక అదే టాస్క్ లో జంతువుల పేర్లు ఇచ్చి వాటికి సరిపోయే ఇంటి సభ్యులకు ఆ టాగ్ ఇవ్వాలని చెప్పాడు బిగ్ బాస్. ఇందులో పాము, గాడిద, ఊసరవెల్లి, ఏనుగు, సింహం.. లాంటి జంతువుల ట్యాగులు ఉండగా వాటిని ఎందుకు ఇస్తున్నారో కూడా చెప్పామన్నారు. కంటెస్టెంట్స్ ఒక్కొక్కరికి ఆ ట్యాగ్ ఇచ్చి ఎందుకు ఇచ్చారో చెప్పారు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అందరికి కలిపి ఓ టాస్క్ ఇచ్చారు. ఇందులో సభ్యులని రెండు గ్రూపులుగా విడగొట్టారు. ఈ టాస్కులో బాలాదిత్య బాగా ఆడటంతో అతన్ని బెస్ట్ కంటెస్టెంట్ గా చెబుతూ..బిగ్ బాస్ కానుక పంపించారు. ఆటలు, టాస్కులు ముగిశాక.. ఎలిమినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు నాగార్జున.
నామినేషన్ లో ఉన్న వారిలో ఆఖర్లో వాసంతి, నేహా చౌదరి మిగిలి ఉండగా.. తక్కువ ఓట్లు రావడంతో నేహా ఎలిమినేట్ అయింది. నేహా స్టేజ్ పైకి వచ్చాక ఆమెకొక టాస్క్ ఇచ్చాడు నాగార్జున. హౌస్ లో దమ్మున్నవాళ్లెవరు, దుమ్మున్నవాళ్లు ఎవరు చెప్పమన్నారు. రేవంత్, ఆరోహి, ఇనయ, అర్జున్, గీతూ, వాసంతి దుమ్మున్న వాళ్లు అని, వారి ఆటలో జెన్యూనిటీ లేదని, ఎలాగైనా గెలవాలని అనుకుంటారని, దానికోసం ఏదైనా చేస్తారని, వారి ఆట తీరు కరెక్ట్ కాదని తెలిపింది. ఇక చంటి, రాజ్, సుదీప, ఆది, బాలాదిత్య, శ్రీహాన్, శ్రీసత్యలు దమ్మున్నవాళ్ళు అని, వీళ్లంతా జాగ్రత్తగా గేమ్ ఆడతారని చెప్పింది నేహా. ఇక్కడితే ఎపిసోడ్ ముగిసింది. ఇక నేటి ఎపిసోడ్ లో ఎంతమంది నామినేట్ అవుతారు, ఎన్ని గొడవలవుతాయనేది చూడాలి.
Next Story