Mon Dec 23 2024 18:19:57 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 Day 32 : వినోద భరితంగా బిగ్ బాస్.. హౌస్ లో తన క్రష్ గురించి చెప్పిన ఇనయ
స్పూన్లు విసరడం, తలగడలు విసరడం చేసింది. వాసంతి లేచి చూసింది. మిగతా వారు కదిలినట్టు కనిపించారు..
నాలుగు వారాలుగా గొడవలు, అలకలు, గేమ్ స్ట్రాటజీలతో సాగిన బిగ్ బాస్ హౌస్.. రెండ్రోజులుగా పూర్తి వినోద భరితంగా మారిపోయింది. ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో భాగంగా జంబలకిడి పంబ ప్రేక్షకులను అలరించింది. గొడవలు, అలకలు, గేమ్ ప్లాన్ లు, స్ట్రాటజీలు, వెన్నుపోట్లేవీ లేకుండా.. హౌసంతా కలిసి ఆడుతూ.. వినోదాన్ని పంచుతున్నారు. 32వ రోజు టెలీకాస్ట్ అయిన ఎపిసోడ్ లో మెరీనా - వాసంతి లు తమని తాము ఎలివేట్ చేసుకునేందుకు అర్థరాత్రి దెయ్యాల గెటప్ లు వేసుకుని హౌస్ మేట్స్ ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తారు.
ఫైమా.. బిగ్ బాస్ తనకు ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ని అమలు చేస్తుంది. ఇందులో భాగంగా ముగ్గురు ఇంటి సభ్యుల నిద్రకు భంగం కలిగించాలి. స్పూన్లు విసరడం, తలగడలు విసరడం చేసింది. వాసంతి లేచి చూసింది. మిగతా వారు కదిలినట్టు కనిపించారు కానీ నిద్రభంగం కలిగినట్టు అనిపించలేదు. మరి ఫైమా ఈ టాస్క్ లో సక్సెస్ అయిందో లేదో బిగ్ బాస్ చెప్పాలి. తెల్లవారితే.. బిగ్ బాస్ ఇంటికి ఒక కేక్ ను పంపి.. దానిని పావుగంట సమయంలో నలుగురు మాత్రమే తినాలని చెప్తాడు. కానీ.. ఇంటి సభ్యులు చర్చించుకోవడంతోనే టైమ్ వేస్ట్ చేయడంతో ఆ కేక్ ను వెనక్కి తీసేసుకుంటాడు.
ఇనయ ని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి.. ఓ కేకు ముక్కని ఎదురుగా పెట్టి ఇంట్లో గాసిప్స్ గురించి అడుగుతాడు. తనకు సూర్య మీద క్రష్ ఉందని, రోజురోజుకీ అతను నచ్చేస్తున్నాడని చెప్తుంది. ఆరోహితో దగ్గరగా మాట్లాడుతున్నప్పుడు కాస్త కోపం వచ్చేదని అంది. ఇనయా వైపు నుంచి ఇష్టం ఉన్నట్టు ముందు ఎపిసోడ్లో గీతూ కూడా చెప్పింది. అయితే సూర్య వైపు నుంచి మాత్రం ఏమీ కనిపించడం లేదు. అర్జున్ - వాసంతి కూడా దగ్గరవుతున్నారని, భవిష్యత్తులో వారిద్దరూ జంటగా మారొచ్చని చెప్పింది. ఇంట్లోకి ఒక జోకర్ ని పంపి.. అందరినీ ఫ్రీజ్ చేశాడు బిగ్ బాస్. అతను కాసేపు ఇంటి సభ్యులతో ఆడుకున్నాడు. చివరికి శ్రీ సత్య ముఖానికి కేకును కొట్టి వెళ్లిపోయాడు.
Next Story