Mon Jan 13 2025 23:03:29 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 Day 60 : శ్రీసత్య వీక్ అనుకుని పొరపాటు చేసిన బ్లూ టీమ్.. సీక్రెట్ టాస్క్ సక్సెస్.. కెప్టెన్ శ్రీసత్య
గత ఎపిసోడ్ లో ఆదిరెడ్డికి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇవ్వగా.. ఆదిరెడ్డి తన టీంతో కలిసి బాత్రూంని డర్టీగా మార్చాడు.
బిగ్ బాస్ సీజన్ 6 లో గురువారం టెలీకాస్ట్ అయిన 60వ ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యేందుకు అన్నిరకాలుగా సిద్ధమయ్యారు. ఈ వారం కెప్టెన్సీ టాస్కులో అన్నీ ఫిజికల్ టాస్కులే ఇస్తున్నాడు బిగ్ బాస్. గత ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ ని రెండు టీములుగా విడగొట్టి కర్రలు ఇచ్చి కొట్టుకోమన్నాడు. గురువారం ఎపిసోడ్ లో ఏకంగా డైరెక్ట్ గా కొట్టేసుకున్నారు. మిషన్ ఇంపాజిబుల్ టాస్క్ లో భాగంగా.. గ్రానైట్స్ పడతాయి. వాటిని ఏ టీమ్ ఎక్కువ కలెక్ట్ చేస్తే.. ఆ టీమ్ విన్ అయినట్లు. ఈ టాస్క్ లో ఒకరి మీద ఒకరు పడిపోయి మరీ, ఒకరి దగ్గర్నుంచి ఒకరు లాక్కొని నానా హంగామా చేశారు హౌస్ మేట్స్.
గత ఎపిసోడ్ లో ఆదిరెడ్డికి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇవ్వగా.. ఆదిరెడ్డి తన టీంతో కలిసి బాత్రూంని డర్టీగా మార్చాడు. ఈ విషయంలో రెండు గ్రూపుల మధ్య కాసేపు గొడవ జరిగింది. రాత్రి పూట గీతూ ఆదిరెడ్డి షర్ట్ ని దొంగిలించింది. దీంతో ఆదిరెడ్డి అడిగితే నాకు తెలీదు అంది. ఒకవేళ గీతూనే తీస్తే రేపట్నుంచి ఆదిరెడ్డి వర్సెస్ గీతూ అన్నట్టుగా ఆట ఉంటుందన్నాడు. ఆడియన్స్ కూడా దానికోసమే ఎదురుచూస్తున్నారు. ఇక ఇనయా ఫుడ్ విషయంలో ఓవరాక్షన్ చేసింది. ఫైమా భోజనానికి పిలవగా.. తనకు ఆకలి లేదు, తినను అని చెప్పింది. మళ్ళీ తినే సమయానికి వచ్చి సూర్య ప్లేట్ కనపడలేదు, నేను దాంట్లో తింటున్నాను అని తెలుసు కదా అని హడావిడి చేసింది. సూర్య ప్లేట్ లేకపోతే నేను తినను అని మారాం చేసింది. కొంతమంది సెటైర్స్ వేస్తే కీర్తి, వాసంతిలు తినిపించడానికి ట్రై చేశారు. సూర్య మీద అంత ప్రేమ ఉంటే సెల్ఫ్ ఎలిమినేషన్ అయిపోయి సూర్య వాళ్ళింట్లో కూర్చోమనండి అని శ్రీసత్య కౌంటర్ ఇచ్చింది.
శ్రీహాన్ కూడా ముందేమో ఆకలి లేదు తినను అని ఇప్పుడేమో సూర్య ప్లేట్ లేదు తినను అంటున్నావు, డ్రామాలు చేస్తున్నావు అంటూ కౌంటర్ ఇచ్చాడు. రెండోసారి గ్రానైట్ ను బ్లూ దక్కించుకోవడంతో.. ఇరు టీమ్ లకి మరో టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్.. రెడ్ టీమ్ లో ఎవరు పాల్గొనాలో ఎంచుకోమన్నాడు. బ్లూ టీమ్ నుండి రోహిత్, ఇనయ, రెడ్ టీమ్ నుండి.. శ్రీసత్య, ఫైమా లను ఎంపిక చేశారు. ఈ టాస్క్ కి బాలాదిత్య సంచాలకుడిగా ఉన్నాడు. ఇందులో శ్రీసత్య విన్ అవడంతో.. టీమ్ రెడ్ విన్నర్ గా నిలిచింది. ఇక చివర్లో బ్లూ, రెడ్ టీమ్స్ డైరెక్ట్ గా కొట్టుకున్నారు. దీంట్లో రేవంత్ కంటికి గాయమైంది. కాగా.. ఈవారం కెప్టెన్ శ్రీసత్య అని ఇప్పటికే లీకులు వచ్చాయి.
Next Story